FB Fake Accounts
FB Fake Accounts : ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్‌లలో ఫేస్‌బుక్ (Facebook) ఒకటి. ఈ ప్లాట్‌ఫారంలో కంటెంట్‌ను షేర్ చేయడంతో పాటు వీడియో-ఆడియో, రీల్స్‌ను యాక్సస్ చేయొచ్చు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింతగా సులభతరం చేసేందుకు మెటా కంపెనీ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. కానీ, ఈసారి మెటా ఫేక్ అకౌంట్లపై కొరడా ఝళిపించింది. ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలు ఉపయోగించే యూజర్లు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెటా ఇటీవలే ఫేక్ కంటెంట్ పేరుతో 10 మిలియన్ల (కోటి) అకౌంట్లను సస్పెండ్ చేసింది.
కోటికి పైగా ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ అకౌంట్లలో ఎక్కువ భాగం ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. స్పామ్ కంటెంట్ క్యాంపెయిన్ కింద మెటా ఈ ఏడాదిలో రెండు త్రైమాసికాల్లో ఫేక్ అకౌంట్ల భరతం పట్టింది. ఫేక్ కంటెంట్ వ్యాప్తిని నివారించడానికి ఈ అకౌంట్లపై చర్య తీసుకుంది.
10 మిలియన్లకు పైగా ఫేక్ అకౌంట్లు, 5 లక్షల స్పామ్ అకౌంట్లు :
ఒరిజినల్ క్రియేటర్ల మాదిరిగా కనిపించే 10 మిలియన్లకు పైగా ఫేక్ అకౌంట్లు, 5లక్షల స్పామ్ అకౌంట్లను ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్లు తెలిపింది. కాపీ-పేస్ట్ మెథడ్ ఉపయోగిస్తున్న ఈ కంటెంట్ క్రియేటర్లు ఇతరుల కంటెంట్‌ను ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా కనీసం క్రెడిట్స్ లేకుండా రీపోస్ట్ చేస్తున్నారని కంపెనీ తెలిపింది.
ఇలాంటి ఫేక్ కంటెంట్ క్రియేటర్లను జల్లెడ పట్టి మరి తొలగిస్తోంది. తద్వారా ఫేస్‌బుక్ ఫీడ్‌లను క్లీన్ చేయడం, రీసైకిల్ మీమ్‌లు, వైరల్ వీడియోల గజిబిజిని తగ్గించడం, ఒరిజనల్ క్రియేటర్లకు ఎక్కువగా విజిబులిటీ, డబ్బు సంపాదించుకునేలా లక్ష్యంగా పెట్టుకుంది.
రీసైకిల్ కంటెంట్‌పై మెటా నిబంధనలు కఠినతరం :
2025 ప్రారంభం నుంచి మెటా ఈ కింది ప్యాట్రన్స్ ప్రదర్శించే అకౌంట్లను లక్ష్యంగా తొలగిస్తుంది.
ఇలాంటి ఫేక్ అకౌంట్ల కంటెంట్ ఇప్పుడు ప్లాట్‌ఫాంలో కనిపించవు. మనీ సంపాదించుకోలేరు. అదేపనిగా చేస్తే అకౌంట్ సస్పెన్షన్‌ను కూడా ఎదుర్కొంటాయి. రీమిక్సింగ్ లేదా రీయూజ్ కంటెంట్ ఇప్పటికీ ఆమోదయోగ్యం కాదు. కానీ, ఆ కంటెంట్‌కు మరింత వాల్యూతో కొత్తగా విషయాలు ఉండాలని మెటా స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో కొత్త AI పాలసీతో సహా అనేక ఇతర ఫీచర్లపై కూడా మెటా పని చేస్తోంది.
ఒరిజినల్ క్రియేటర్ల కోసం అట్రిబ్యూషన్ టూల్స్ :
ఫేస్‌బుక్ నకిలీ కంటెంట్ గుర్తించినప్పుడల్లా ఒరిజినల్ క్రియేటర్లకు ఆటోమాటిక్‌గా లింక్ చేసే అట్రిబ్యూషన్ టూల్స్ కూడా మెటా టెస్టింగ్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ అల్గోరిథం రీసైకిల్ చేసిన వీడియోలను కూడా కనిపించకుండా చేస్తుంది.
ఒరిజినల్ వెర్షన్ కంటెంట్ ఎక్కువగా ఫీడ్ లో కనిపించేలా ఫుష్ చేస్తుంది. ఎడిట్ చేయని లేదా లైట్ ఎడిట్ చేసిన కంటెంట్‌ను పోస్ట్ చేసే క్రియేటర్లు మెటా మానిటైజేషన్ ప్రోగ్రామ్స్ కింద డబ్బులు సంపాదించలేరు. మెటా కొత్త నిబంధనల ప్రకారం.. వాటర్‌మార్క్ వేయడం లేదా క్లిప్‌లను కలపడం వంటి కుదరదు..
ఒరిజినల్ క్రియేటర్లకు కొత్త అట్రిబ్యూషన్ టూల్స్ :
క్రియేటర్లు అకౌంట్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? :