Meta Wristband : మెటా కొత్త ‘రిస్ట్‌బ్యాండ్’ వస్తోంది.. ఇక వేళ్లను కదపనక్కర్లేదు.. జస్ట్ మైండ్ రీడింగ్‌తోనే ల్యాప్‌టాప్, ఫోన్లను కంట్రోల్ చేయొచ్చు..!
Meta Wristband : మెటా చేతి వేళ్లతో పనిలేకుండా మైండ్ రీడింగ్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అర్థం చేసుకునేలా రిస్ట్‌బ్యాండ్ రెడీ చేస్తోంది.

Meta Wristband
Meta Wristband : టెక్ ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకీ సరికొత్త టెక్నాలజీలు ఆవిష్కృతవుతున్నాయి. ఫిజికల్ మూవెంట్స్ అవసరం లేకుండానే (Meta Wristband) కంట్రోల్ చేయగల డివైజ్‌లు రాబోతున్నాయి. అంటే.. కేవలం మైండ్ రీడింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు అలాంటి డివైజ్‌ను మెటా దిగ్గజం డెవలప్ చేస్తోంది.
అదే కొత్త రిస్ట్‌బ్యాండ్ డివైజ్.. మజిల్స్ ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అర్థం చేసుకునే వినూత్న రిస్ట్‌బ్యాండ్‌ను తీసుకొస్తోంది. ఈ డివైజ్ ద్వారా చేతుల వేళ్లు కదపకుండానే ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లను కంట్రోల్ చేయొచ్చు అనమాట. వినియోగదారులు చేయాల్సిందిల్లా.. జస్ట్ మైండ్ రీడింగ్ ద్వారా మూవెంట్ ఫీల్ అవ్వాలి. వెంటనే డివైజ్ రెస్పాన్స్ అవుతుంది.
నేచర్ జర్నల్ నివేదిక ప్రకారం.. మెటా ఒక వ్యక్తి కండరాల నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అర్థం చేసుకోగల స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లను కంట్రోల్ చేసే రిస్ట్‌బ్యాండ్‌ను డెవలప్ చేసింది.
ఈ రెస్ట్ బ్యాండ్ ధరించిన వ్యక్తి డివైజ్‌ల కంట్రోలింగ్ కోసం ఎక్కడికి కదలకూడదు. కేవలం మైండ్ ద్వారా మూవెంట్ గురించి ఆలోచిస్తే సరిపోతుంది. అప్పుడు ఆ డివైజ్ స్క్రీన్‌పై రెస్పాన్స్ మొదలువుతుంది. ప్రస్తుతానికి ఈ డివైజ్ టెస్టింగ్ స్టేజీలోనే ఉంది. రాబోయే కొన్ని ఏళ్లలో గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు మెటా తెలిపింది.
మెటా మైండ్ రీడింగ్ రిస్ట్‌బ్యాండ్ ఫీచర్లు :
మెటాస్ రియాలిటీ ల్యాబ్స్ రీసెర్చర్లు ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG)తో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ను రూపొందించారు. ఈ టెక్నిక్ మెదడు నుంచి కండరాలకు ముఖ్యంగా మోచేతి ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ రీడ్ చేయగలదు. ఈ సిగ్నల్స్ చాలా బలంగా ఉంటాయి. స్కిన్ ద్వారా రీడ్ చేయొచ్చు. కండరాల మూవెంట్స్ కన్నా ఎక్కువ వేగంతో కదలవచ్చు.
Read Also : Federal Bank Biometric : ఇక ఓటీపీల గోల లేదు.. జస్ట్ కంటిచూపుతోనే పేమెంట్ చేసేయొచ్చు.. అది ఎలాగంటే?
మెటా పరిశోధన ఉపాధ్యక్షుడు థామస్ రియర్డన్ ప్రకారం.. ‘మీరు నిజంగా కదలాల్సిన అవసరం లేదు. కంట్రోల్ చేస్తే సరిపోతుంది అన్నారు. కండరాల సిగ్నల్ ప్యాట్రన్స్ విశ్లేషించేందుకు ఈ టెక్నాలజీ ఎక్కువగా ఏఐపై ఆధారపడి ఉంటుంది.
బ్యాండ్ ప్యాట్రన్స్ ధరించిన 10వేల కన్నా ఎక్కువ మంది వాలంటీర్ల నుంచి మెటా ఈ డేటాను సేకరించింది. మెషిన్ లెర్నింగ్ సాయంతో మెటా రియాలిటీ ల్యాబ్స్ బృందం నిర్దిష్ట మూవెంట్స్ సంబంధించిన ప్యాట్రన్స్ గుర్తించేలా సిస్టమ్‌కు ట్రైనింగ్ ఇచ్చింది.
అయితే, కొత్త యూజర్లు ఈ ట్రైనింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎందుకంటే.. మొదటి నుంచి ట్రైనింగ్ పొందాల్సిన అవసరం ఉండదు. ఈ రెస్ట్‌బ్యాండ్ ధరిస్తే సరిపోతుంది. ఈ డివైజ్ డిజైన్ చూసేందుకు అచ్చం స్మార్ట్‌వాచ్ మాదిరిగానే కనిపిస్తుంది. చాలా పెద్దది కూడా. యాక్టివ్ బ్యాండ్‌తో గాలిలోనే మెసేజ్‌లు రాయొచ్చు.
ఈ రిస్ట్‌బ్యాండ్ ద్వారా ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ రిస్ట్‌బ్యాండ్ మార్కెట్లోకి లాంచ్ కాలేదు. మార్కెట్లో అందుబాటులోకి వచ్చాక ఈ టెక్నాలజీ వర్కింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వికలాంగులకు ఒక వరం లాంటిది.