Federal Bank Biometric : ఇక ఓటీపీల గోల లేదు.. జస్ట్ కంటిచూపుతోనే పేమెంట్ చేసేయొచ్చు.. అది ఎలాగంటే?
Federal Bank : ఇకపై ఈ బ్యాంకు కస్టమర్లు టచ్ లేదా లుక్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేయొచ్చు. ఈ బ్యాంక్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొచ్చింది.

Federal Bank
Federal Bank Biometric : ప్రస్తుత రోజుల్లో ఏ ఆన్‌లైన్ పేమెంట్ చేయలన్నా OTP వెరిఫికేషన్ తప్పనిసరి. కానీ, ఇకపై ఈ బ్యాంకు లావాదేవీలకు ఓటీపీ అవసరం ఉండదు. ప్రత్యేకించి ఫెడరల్ బ్యాంక్ ఈ-కామర్స్ కార్డ్ లావాదేవీలపై భారత మార్కెట్లో మొట్టమొదటి బయోమెట్రిక్ అథెంటికేషన్ సొల్యుషన్ ప్రవేశపెట్టింది. ఆసక్తిగల వినియోగదారులు ఇప్పుడు వారి ఫింగర్‌ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీని టచ్ చేయడం లేదా చూడటం ద్వారా ఆన్‌లైన్ కొనుగోళ్లను అథెంటికేట్ చేయొచ్చు.
ఫెడరల్ బ్యాంక్ బయోమెట్రిక్ అథెంటికేషన్ బెనిఫిట్స్ ఇవే :
ఫెడరల్ బ్యాంక్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఇకపై OTP అవసరం ఉండదు. కస్టమర్లు తమ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీ ఉపయోగించి ఆన్‌లైన్ కొనుగోళ్లకు కేవలం 3 సెకన్లలో అథెంటికేషన్ పొందవచ్చు. ప్రతి లావాదేవీ మీ డివైజ్ ద్వారా సురక్షితంగా వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) ఏంటి? :
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్ని డిజిటల్ లావాదేవీల భద్రత కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరి చేసింది. పాస్‌వర్డ్, పిన్, డివైజ్, OTP లేదా బయోమెట్రిక్స్ కావచ్చు. సాధారణంగా పాస్‌వర్డ్, పిన్, డివైజ్ బైండింగ్, గ్రిడ్ నంబర్, సెక్యూరిటీ ప్రశ్నలు, OTP, ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ID వంటివి అథెంటికేషన్ కోసం వినియోగించవచ్చు.
బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి? (Federal Bank Biometric) :
బయోమెట్రిక్ సెటప్ పూర్తయిన తర్వాత మీరు ఈ కింది విధంగా సులభంగా పేమెంట్ చేయొచ్చు. పార్టనర్ మర్చంట్ యాప్ చెక్అవుట్ స్క్రీన్‌లో అందుబాటులో ఉన్న ఆప్షన్లతో టోకనైజ్డ్ కార్డ్‌ను ఎంచుకోండి. మీరు నేరుగా బయోమెట్రిక్ అథెంటకేషన్ పేజీని పొందవచ్చు.
మీ ఫింగర్‌ఫ్రింట్ ఫేస్ ఐడీని ఉపయోగించి పేమెంట్లను అథెంటికేట్ చేయొచ్చు. లావాదేవీని పూర్తి చేసేందుకు 4 అంకెల పే పిన్‌ను ఎంటర్ చేయండి. బయోమెట్రిక్ అథెంటికేషన్ యాక్టివేట్ కోసం పార్టనర్ మర్చంట్ ప్రొఫైల్‌లోని ఫోన్ నంబర్ మీ బ్యాంక్ వెరిఫైడ్ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో మ్యాచ్ చేయొచ్చు.
మొబైల్ వెబ్ బ్రౌజర్‌లలో పేమెంట్లకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుందా? :
లేదు.. ఉండదు. బయోమెట్రిక్ 2FA యాప్‌లో పేమెంట్లకు మాత్రమే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది.