Millions of Android devices prone to hacking due to GPU bug: Google's Project Zero Team
GPU Bug: ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు లక్షల్లో హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరిస్తోంది. మొబైల్ పరికరాల్లోని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని ఒక బగ్ కారణంగా ఇలా జరిగే అవకాశం ఉందని గూగుల్ పరిశోధకులు తెలిపారు. జీపీయూ బగ్ గురించి చిప్ డిజైనర్ ఏఆర్ఎంని హెచ్చరించినట్లు టెక్ దిగ్గజం ప్రాజెక్ట్ జీరో బృందం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రిటిష్ చిప్ డిజైనర్ కొంత పరిష్కరించినప్పటికీ, పూర్తి స్థాయి పరిష్కారం ఇంకా దొరకలేదట.
ఈ ప్రమాదం ఉందని తెలిసి కూడా శాంసంగ్, షియోమి, ఒప్పో, గూగుల్‌లతో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు దీన్ని పరిష్కరించడానికి ఎలాంటి ప్యాచ్‌లను అమలు చేయలేదని ప్రాజెక్ట్ జీరో బృందం పేర్కొంది. కొన్ని సమస్యలను అప్‌స్ట్రీమ్ విక్రేత పరిష్కరించిందట. అయితే శాంసంగ్, షియోమి, ఒప్పో ఆండ్రాయిడ్ ఫోన్లు ఇంకా డౌన్‌స్ట్రీమ్‌గా మార్చలేదని తెలిపారు. మాలి జీపీయూతో ఉన్న ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఎక్కువగా ఉన్నాయని, వాటికి ఇంకా ప్రమాదం పొంచే ఉందని ప్రాజెక్ట్ జీరో ప్రతినిధి ఇయాన్ బీర్ అన్నారు.
ఈ సమస్యలు ఏడాది జూన్, జూలై 2022 మధ్య గూగుల్ కనుగొని, వెంటనే ఏఆర్ఎంకి నివేదించింది. ఏఆర్ఎం తమ ఆర్మ్ మాలి డ్రైవర్ వల్నరబిలిటీస్ పేజీలో భద్రతా సమస్యలుగా వాటిని బహిర్గతం చేసి, వారి పబ్లిక్ డెవలపర్ వెబ్‌సైట్‌లో ప్యాచ్ చేసిన డ్రైవర్ సోర్స్ ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో సమస్యలను పరిష్కరించింది. అయినప్పటికీ, పూర్తి పరిష్కారం రాలేదని ఎంఆర్ఎం తెలిపింది.
సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉన్న వినియోగదారులు వీలైనంత త్వరగా ప్యాచ్ చేసుకొమ్మని సమాచారం అందుకుంటారని పరిశోధకులు తెలిపారు. ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని, అప్‌స్ట్రీమ్ మూలాలను సమీపంగా అనుసరించాలని అంటున్నారు. వీలైనంత త్వరగా వినియోగదారులకు పూర్తి ప్యాచ్‌లను అందించడానికి తమ వంతు కృషి చేయాలని ఏఆర్ఎం పేర్కొంది. అయితే సామ్ మొబైల్ ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు కంపెనీ స్నాప్‌డ్రాగన్-ఆధారిత హ్యాండ్‌సెట్‌లు ఈ బగ్‌ల వల్ల ప్రభావితం కావని తెలిపింది.
Naked Art: క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం.. 2,500 మంది బట్టలు విప్పేసి ఫొటోలకు ఫోజు ఇచ్చారు