Moto G34 5G with Snapdragon 695 SoC launched in India
Moto G34 5G Launch in India : మోటోరోలా బడ్జెట్ మోటో జీ34 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో క్రిస్మస్‌కు ముందు చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
Read Also : Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?
మోటో జీ34 5జీ స్పెసిఫికేషన్లు :
మోటో జీ34 5జీ 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 500నిట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీతో పాటు గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు అడ్రినో 619 జీపీయూతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మెమరీని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు.
ఆప్టిక్స్ పరంగా చూస్తే..
మోటోరోలా జీ34 5జీ ఫోన్ వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో ముందు భాగంలో 16ఎంపీ సెన్సార్ కూడా ఉంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సెటప్‌తో వస్తుంది. ఇది 2 సిమ్ కార్డ్‌లకు సపోర్టు అందిస్తుంది. అందులో ఒకటి సిమ్, మరొకటి మైక్రో ఎస్‌డీ కార్డ్‌కు సపోర్టు ఇస్తుంది.
Moto G34 5G launched
3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్, ఐపీ52 స్ప్లాష్ రెసిస్టెన్స్‌కు సపోర్టుతో స్టీరియో స్పీకర్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 20డబ్ల్యూ టర్బోచార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. మోటో జీ34 5జీ మోటోరోలా మైయూఎక్స్ ఆధారంగా సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది. వినియోగదారులకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఈ ఫోన్‌తో ఒక ఏడాది ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను కూడా పొందవచ్చు.
మోటో జీ34 5జీ ధర :
లేటెస్ట్ మోటోరోలా ఫోన్ 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999, 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999కు పొందవచ్చు. మోటో జీ34 5జీ మోడల్ మొత్తం ఐస్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ లేదా ఓషన్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.