మోటో G67 పవర్ 5G వచ్చేసింది.. అతి తక్కువ ధరకే 7000mAh బ్యాటరీ, పాంటోన్ డిస్‌ప్లే.. కొనాలా, వద్దా?

యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

మోటో G67 పవర్ 5G వచ్చేసింది.. అతి తక్కువ ధరకే 7000mAh బ్యాటరీ, పాంటోన్ డిస్‌ప్లే.. కొనాలా, వద్దా?

Moto G67 Power 5G

Updated On : November 12, 2025 / 9:10 PM IST

Moto G67 Power 5G: మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలో శక్తిమంతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ బ్యాటరీ, చిప్‌సెట్, పాంటోన్ ధ్రువీకరించిన డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ను కొనాలా? లేదా రాబోయే మరిన్ని ఫోన్‌ల లాంచ్‌ల కోసం వేచి చూడాలా? అన్న విషయంపై క్లారిటీ కోసం దీని ఫీచర్లు చూడండి..

ప్రాసెసర్: వేగవంతమైన పనితీరుకు గ్యారెంటీ
మోటో G67 పవర్ 5Gలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen2 చిప్‌సెట్ ఉంది. ఇది 2.4GHz వేగంతో నడిచే ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వసచ్చింది. ఈ సెటప్ గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ పనుల్లో స్థిరమైన, వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 8GB ర్యామ్‌తో పాటు అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది, కాబట్టి యాప్‌ల మధ్య మారుతూ ఉన్నప్పుడు కూడా స్మూత్ స్పీడ్ లభిస్తుంది. 128GB ఇన్‌బిల్ట్ మెమొరీ సరిపడా స్టోరేజీని అందిస్తుంది. హైబ్రిడ్ మెమొరీ కార్డ్ స్లాట్ ద్వారా గరిష్టంగా 1TB వరకు ఎక్స్‌పాండ్‌ చేసుకోవచ్చు.

Also Read: iQOO 15 లాంచ్‌కు సిద్ధం: మీరు సిద్ధమా? ధర లీక్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తోంది.. ప్రీ బుకింగ్ ఆఫర్లు ఇవే..

డిస్‌ప్లే, బ్యాటరీ
డిస్‌ప్లే: ఈ ఫోన్‌ 6.7 అంగుళాల LCD ప్యానెల్, 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో స్పష్టమైన విజువల్స్, బ్రైట్‌నెస్‌తో కలర్స్‌ను అందిస్తుంది. కోరింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌తో పాటు యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్ కూడా ఉంది. ఆక్వా టచ్‌ ఫీచర్ వల్ల తడి చేతులతోనూ స్మూత్ టచ్ పనిచేస్తుంది.

బ్యాటరీ: మోటో G67 పవర్ 5G ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. భారీ 7000mAh బ్యాటరీతో వచ్చింది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తుండడంతో వేగంగా ఛార్జ్ అవుతుంది. తరచూ ఫోన్ ఛార్జ్ చేయాలనుకోని వినియోగదారులకు ఇది సరైన ఆప్షన్.

కెమెరా
మోటోరోలా ఇందులో డ్యుయల్ కెమెరా సెటప్‌ను అందించింది. 50MP ప్రధాన సెన్సార్, 8MP రెండో లెన్స్ ఉన్నాయి. వీడియోల కోసం ఇది 1080p@60fps రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ముందువైపు 32MP కెమెరా Sony LYTIA 600 సెన్సార్‌తో పనిచేస్తుంది. స్పష్టంగా సెల్ఫీలను ఇస్తుంది.

ధర, ఆఫర్లు
ఈ ఫోన్ అసలు ధర రూ.18,999 కాగా, 15% డిస్కౌంట్ తర్వాత రూ.15,999కి లభిస్తోంది. మిడ్‌రేంజ్ విభాగంలో మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. EMI ఆప్షన్ నెలకు రూ.2,667 నుంచి ప్రారంభమవుతుంది.

బ్యాంక్ ఆఫర్లు
యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. BHIM UPI చెల్లింపులపై రూ.50 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఉంది. రూ.7,500కు పైగా కొనుగోళ్లపై బజాజ్ ఫిన్‌సెర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్‌ ద్వారా అదనపు రాయితీలు ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో గరిష్టంగా రూ.12,100 వరకు లభిస్తుంది.