మంచి డిస్కౌంట్‌ బాసూ.. రూ.15,100కే ఇప్పుడు Moto G85 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనేయొచ్చు..

డ్యూయల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్‌ సహా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

మంచి డిస్కౌంట్‌ బాసూ.. రూ.15,100కే ఇప్పుడు Moto G85 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనేయొచ్చు..

Updated On : May 5, 2025 / 9:55 PM IST

మిడ్ రేంజ్ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అమెజాన్‌లో మోటో జీ85 5జీపై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లను కూడా వాడుకుంటే మీరు దాదాపు రూ.3,000 ఆదా చేయవచ్చు.

ఇండియన్ మార్కెట్లో సుమారు రూ.17,999కు మోటో జీ85 5జీ విడుదలైంది. డ్యూయల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్‌ సహా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

మోటో జీ85 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో ప్రస్తుతం రూ.16,348కు లభ్యమవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులు వంటి పలు బ్యాంక్ కార్డులను వాడి బిల్‌ కడితే అదనంగా రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ధర రూ.15,100కి దిగొస్తుంది.

Also Read: వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు..

అంతేగాక, ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. మరోవైపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.15,400 వరకు పొందొచ్చు. మీ పాత ఫోన్ పనిచేస్తున్న తీరును బట్టి ఎక్స్‌చేంజ్‌ ఆఫర్ కింద ఈ విలువను నిర్ణయిస్తారు.

మోటో జీ85 5జీ ఫీచర్లు
మోటో జీ85 5జీ 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వచ్చింది. 6.67-అంగుళాల 120 హెర్ట్‌జ్‌ కర్వ్డ్‌ పోలెడ్ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చింది.

ఇందులో 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. డస్ట్‌, వాటర్ రెసిస్టెన్సీ IP52 రేటింగ్‌తో ఉంది. 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఫ్రంట్‌ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.