ఈ వారం (అక్టోబర్ 12 నుంచి 18) రాశి ఫలాలు.. వీరికి కీర్తి ప్రతిష్ఠలు.. బంగారం కొంటారు..
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...

Rashi Phalalu
Rashi Phalalu: ఈ వారం (అక్టోబర్ 12 నుంచి 18) రాశి ఫలాలు..
గురువు మిధున రాశిలో 18వ తేదీ నుంచి
గురువు కర్కాటకంలో అతిచారములో
శని మీనరాశిలో వక్రగతి రాహుకేతువులు
కుంభ సింహరాశిలో శుక్ర రవి గ్రహములు
కన్యా రాశిలో కుజ బుదుడు
తులా రాశిలో చంద్రుడు మిధునం, కర్కాటకం, సింహ రాశులలో సంచారం
మేషం: కుటుంబంలో భార్యబిడ్డల మూలకంగా సుఖశాంతులు. ప్రతి పనిని సమర్థవంతముగా నిర్వహిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు దేహారోగ్యములు కలుగుతుంది. అన్యస్త్రీ పరిచయ భాగ్యములు కలుగుతాయి. లలితాదేవి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
వృషభం: ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి. కుటుంబములోని వారు ఆరోగ్యముగా ఉంటారు. స్త్రీలతో ప్రియ సంభాషణలు చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. విద్యావంతులు గౌరవసన్మానములు పొందుతారు. ఆరోగ్యము. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనకధారస్తోత పారణయము చేస్తే మంచిఫలితములు కలుగుతాయి.
మిధునం: శుభకార్యముల వల్ల ధన వ్యయము, పశునష్టము, స్థాన చలనము, మానసిక ఆందోళనలు, మనఃశాంతి లేకపోవడం, వృథా భ్రమణం, పనులలో ఆలస్యం, నిరాశ, ఉద్యోగ వ్యాపారములలో చికాకులు, అన వసరమైన తగాదాలు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.
కర్కాటకం: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడము, బంధు మిత్రులతో వైరము మరచిపోవడం, అధికారుల ఒత్తిడి, అనారోగ్యము, కోర్టు వివాదములు, ప్రయాణంలో ఇబ్బందులు, తగాదాలు. శివస్తోత్ర పారాయణము చేయడం వల్ల మంచి జరుగుతుంది.
సింహం: ఉద్యోగ లాభం, అన్నింటిలో ముందంజ కార్యవిజయం, విలువైన ఆభరణములు కొనుగోలు కార్యసిద్ధి, వ్యాపారములో లాభములు, రుణములు చేతికి అందటం, ఇంటినిర్మాణం, మరమ్మత్తులు వాహనములు కొనుగోలు – శ్రీ సుబ్రహ్మణ్య స్వామ అష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
కన్యా: మానసిక వేదన, ఆహార సంబంధ సమస్యలు, వృథా సంచారం, ఉద్యోగంలో లాభములు, వ్యాపార అభివృద్ధి. జాయింటుదారుల మధ్య సఖ్యత, విదేశీయానం, అకాల భోజనము, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విష్ణు సహస్ర నామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితములు కలుగుతాయి.
తులా: మంచి ఉద్యోగం లభించడం, సమాజంలో గౌరవం పెరగడం, సుఖ నిద్ర, భోజన సౌఖ్యం, వ్యాపార విస్తరణ, బంగారము కొనుగోలు, వాహనములో తిరగడం, విందు, వినోదములలో పాల్గొనటం, అధికారులతో మంతనాలు, సన్మానములు. గణపతిని గకార అష్ఠోత్తరముతో పూజ చేస్తే సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం: అపకీర్తి, స్థానచలనము, మానసిక ఆందోళనలు, అగౌరవము, అధికారులు ఒత్తిడి. వ్యాపారంలో జాయింటుదారుల మధ్య గొడవలు. ధన ఆదాయం పెరగడం, మానసిక ప్రశాంతత లేకపోవడం. నవగ్రహములకు ప్రదక్షిణ చేయడం వల్లమంచి జరుగుతుంది.
ధనుస్సు: శుభవార్తలు, విందు భోజనం, నూతన లాభములు, ప్రముఖవ్యక్తుల కలయిక ద్వారా అధిక లాభములు, స్త్రీలకు ఉన్నతమైన ఆలోచనలు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం. రాజ రాజేశ్వరి అమ్మవారి ఆరాధనవల్ల చేస్తే శుభ ఫలితములు వస్తాయి.
మకరం: వృత్తి, ఉద్యోగ వ్యాపారములో అభివృద్ధి, సుఖసంతోషములు, విద్యార్థులకు అనుకూలం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, నేత్ర సంబంధ వ్యాధులు, అన్నింటా లాభం, ప్రేమ కలాపాలు, కార్యలాభము. లక్ష్మీ జపము చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
కుంభం: కార్యరంగంలో ప్రతికూలత, బంధు, మిత్ర, పుత్ర విరోధము, కుటుంబ సమస్యలు. వృథా భ్రమణం, వ్యాపారవృద్ధి సుఖ సంతోష ములు, శుభకార్యనిర్వహణ, స్థిరాస్తులతో లాభం, ధనాదాయం.నరసింహస్వామి వారి ఆరాధనవల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీనం: ధననష్టం జరుగుతుంది. ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. మనస్పర్ధలు, స్త్రీలకు గర్భసంబంధ అనారోగ్యం, నిద్రలేమి, అకారణ వైరం, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉష్ణసంబంధ వ్యాధులు, మానసిక ఆందోళనలు, చంద్రగ్రహ ఆరాధన వల్ల శుభఫలితములు కలుగుతాయి.
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956