Moto G85 5G Launch : మోటో G85 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G85 5G Launch : మోటో జీ85 5జీలో కెమెరా సెటప్ ఆకట్టుకునేలా రూపొందించింది. బ్యాక్ డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Moto G85 5G Launch : మోటో G85 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G85 5G launching in India tomorrow ( Image Source : Google )

Moto G85 5G Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఇండియా నుంచి మోటో జీ85 5జీ ఫోన్ వస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రేపు (జూలై 10) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ 5జీ ఫోన్ లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్ల గురించి అనేక పుకార్లు బయటకు వచ్చాయి.

Read Also : New British Motorcycle : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. భారత్‌కు కొత్త బ్రిటీష్ బుల్లెట్ ‘బీఎస్ఏ గోల్డ్‌స్టార్’ బైక్ వస్తోంది..

ఐరోపాలో మోటో జీ85 5జీ ఫోన్ మోటోరోలా ఎస్50 నియో రీబ్రాండెడ్ వేరియంట్‌గా లాంచ్ అయింది. వాస్తవానికి, మోటోరోలా రెజర్ 50 సిరీస్‌తో పాటు చైనాలో లాంచ్ అయింది. భారతీయ వేరియంట్ స్పెషిఫికేషన్ ఐరోపాలో లాంచ్ చేసిన ఫోన్ మాదిరిగానే ఉంటే.. మోటోరోలా జీ85 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ 3 కలర్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు.

డిస్‌ప్లే, డిజైన్ :
మోటో జీ85 5జీ ఫోన్ అద్భుతమైన 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో అద్భుతమైన వ్యూ పొందవచ్చు. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా మోటో జీ85 5జీ ఫోన్ సెట్ కేవలం 175 గ్రాముల బరువు ఉంటుంది. 7.59 మి.మీ మందంతో వస్తుంది. ఈ ఫోన్ ఫోన్ మొత్తం 3 వేగన్ లెదర్ ఎండ్‌ (కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే) ఆప్షన్లతో వస్తుంది.

మోటో డిస్‌ప్లే :
మోటో ఫోన్ జీ85 5జీ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ఉంది. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ చిప్‌సెట్, గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కలిపి మల్టీ టాస్కింగ్, యాప్‌లు, మీడియా, ఫైల్‌లకు స్టోరేజీని అందిస్తుంది. లో స్టోరేజీ అవసరం ఉన్న యూజర్లకు 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజీతో కూడిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

కెమెరా సామర్థ్యాలు :
మోటో జీ85 5జీలో కెమెరా సెటప్ ఆకట్టుకునేలా రూపొందించింది. బ్యాక్ డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా తక్కువ-కాంతి పరిస్థితుల్లో కూడా స్టేబుల్ ఫొటోలను అందిస్తుంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీ ప్రియులకు ఫ్రంట్ కెమెరా 32ఎంపీ షూటర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. హై-క్వాలిటీ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్‌లను అందిస్తుంది.

బ్యాటరీ రేటింగ్ :
మోటోరోలా ఫోన్ ఐపీ52 రేటింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. దుమ్ము, నీరు స్ప్లాష్‌ల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. అదనంగా, మోటో ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫుల్ డే వినియోగానికి తగినంత బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

అదనంగా, మోటోరోలా ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మోటోరోలా ఫోన్ త్వరగా రీఛార్జ్ చేసుకోవచ్చు. జూలై 10న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో మోటో జీ85 5జీ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : CMF Phone 1 Launch : కొత్త సీఎంఎఫ్ ఫోన్ 1 చూశారా? స్పెషిఫికేషన్లు అదుర్స్, భారత్ ధర ఎంతంటే?