Motorola Edge 60 Pro : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఏకంగా రూ. 5వేల కన్నా తగ్గింపు అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? అయితే ఈ డీల్ మీకోసమే.. అమెజాన్ ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 5వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్ సూపర్-ఫాస్ట్ 125W ఛార్జింగ్‌తో వస్తుంది.

ఈ ఫీచర్లతో ప్రీమియం వ్యూ ఎక్స్‌పీరియన్స్, స్పీడ్, బ్యాటరీ టాప్-అప్‌తో పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో అత్యంత సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదని గమనించాలి. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ఆఫర్ ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో డీల్ : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ రూ.33,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్‌లో రూ.28,990కు అందుబాటులో ఉంది. రూ.5,009 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఈఎంఐ లావాదేవీల కోసం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని వాడితే.. అదనంగా రూ.1,750 తగ్గింపు పొందవచ్చు. ధర మరింత తగ్గాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా రూ.27,400 ఎక్స్ఛేంజ్ ధరతో కొనేసుకోవచ్చు. అయితే, ఫైనల్ రీసేల్ ధర అనేది మీ పాత ఫోన్, వర్కింగ్ కండిషన్, బ్రాండ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 6.7-అంగుళాల కర్వడ్ స్క్రీన్, స్ట్రాంగ్ రిజల్యూషన్, 120Hz మోషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్ట్రాంగ్ గ్లాస్ ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. కంటికి సౌకర్యంగా ఉండే ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB లేదా 12GB మెమరీ, 256GB స్టోరేజీతో స్పీడ్ మీడియాటెక్ చిప్‌లో రన్ అవుతుంది.

మోటోరోలా ఫోన్ 6000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ అత్యంత పవర్ అందిస్తుంది. త్వరిత వైర్డు ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, చిన్న గాడ్జెట్‌లకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అనేక ఏళ్ల పాటు అప్‌డేట్స్ అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 3 బ్యాక్ కెమెరాలతో వస్తుంది. ఇందులో రోజువారీ షాట్ల కోసం 50MP మెయిన్ కెమెరా, 50MP వెడల్పు, క్లోజప్ కెమెరాతో 10MP జూమ్ కెమెరా ఉన్నాయి. 50MP ఫ్రంట్ కెమెరా హై క్వాలిటీ వీడియోకు సపోర్టు ఇస్తుంది. ఈ మోటోరోలా క్లియర్ స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు, 5G, స్పీడ్ Wi-Fi, బ్లూటూత్, NFC, డ్యూయల్ సిమ్ సపోర్టును కూడా కలిగి ఉంది.
