Motorola Edge 60 Pro : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో.. 4 క్రేజీ కెమెరాలు.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!
Motorola Edge 60 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఫోన్ రానుంది. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ధర, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.
- Sreehari A
- Published On : March 28, 2025 / 06:24 PM IST
Motorola Edge 60 Pro
Motorola Edge 60 Pro Price : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60ప్రో వచ్చేస్తోంది. మోటోరోలా రాబోయే భారీ మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్60 ప్రోను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్ (60Pro) మొత్తం 4 కెమెరాలతో రానుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో సహా టాప్ రేంజ్ ఫీచర్లతో రానుంది.
అదనంగా, మోటోరోలా ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ల మాదిరిగానే సరికొత్త అడ్వాన్స్ బటన్‌ను తీసుకురానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 15తో ప్రీలోడెడ్ అయి ఉంటుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందించే ఫస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ ఇంకా లాంచ్ కాకముందే ధరతో పాటు కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫీచర్లు ( అంచనా) :
- ఫోర్ కెమెరా సెటప్ (ట్రిపుల్ రియర్ + సెల్ఫీ)
- OIS సపోర్టుతో సోనీ LYTIA సెన్సార్
- మెరుగైన కంట్రోల్ కోసం కొత్త యాక్షన్ బటన్
- 68W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ 5,100mAh బ్యాటరీ
- అమోల్డ్ 144Hz డిస్‌ప్లేతో ఆండ్రాయిడ్ 15OS
ఐఫోన్ వంటి యాక్షన్ బటన్, అడ్వాన్స్ కెమెరా సెటప్ :
లీక్‌ల ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లెఫ్ట్ సైడ్ అదనపు బటన్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 కెమెరా కంట్రోల్ ఫీచర్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే..?
50MP ప్రైమరీ కెమెరా (సోనీ లైటియా సెన్సార్, OIS సపోర్ట్)
10MP సెకండరీ కెమెరా
13MP థర్డ్ కెమెరా
20MP సెల్ఫీ కెమెరా
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర లీక్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో EUR 649.89 (సుమారు రూ. 60వేలు) ధరకు లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ వేరియంట్‌లలో రానుంది.
