Free Netflix Subscription : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Free Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ ఇండియా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసిన తర్వాత భారతీయ యూజర్ల కోసం జియో, ఎయిర్‌టెల్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Netflix password sharing ends in India_ List of Jio and Airtel plans offering free Netflix subscription

Free Netflix Subscription : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇటీవల భారత మార్కెట్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది. కొత్త విధానం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ వినియోగదారులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను ఒకే ఇంటిలో నివసించే వ్యక్తులతో మాత్రమే షేరింగ్ చేయడానికి అనుమతిస్తుంది.

అంటే.. నెట్‌ఫ్లిక్స్ చూసేందుకు ఏకైక మార్గం మీ సొంత ప్లాన్‌ను కొనుగోలు చేయడమే. అయితే, ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఇతర బిల్లుల నెలవారీ ఖర్చులు, WiFi మొబైల్ కోసం రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకోవచ్చు. OTT సబ్‌స్క్రిప్షన్ అదనపు ఖర్చు చాలా మందికి ఆర్థిక భారం కావచ్చు.

అయినప్పటికీ, OTT ఛానెల్‌ల కోసం ఎక్కువ మొత్తంలో బిల్లులు చెల్లించకుండా యూజర్లను ప్రొటెక్ట్ చేయడానికి (Reliance Jio), (Airtel) వంటి టెలికాం ఆపరేటర్లు (Netflix)కి ఉచిత సభ్యత్వాలతో కాలింగ్, డేటా బెనిఫిట్స్ సహా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Read Also : Ultraviolette F77 Space Edition : భలే ఉంది భయ్యా బైక్.. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ F77 స్పేస్ ఎడిషన్ ఎలక్ట్రిక్ బైక్.. కేవలం 90 సెకన్లలోనే బుకింగ్స్ క్లోజ్..!

అంతేకాదు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS, అదనపు బెనిఫిట్స్, యూజర్లు ప్రత్యేక మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు ఖర్చు చేయాల్సిన పనిలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో తమకు ఇష్టమైన షోలు, మూవీలను ఆస్వాదించవచ్చు. మీరు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే.. ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌ల జాబితాను ఓసారి లుక్కేయండి.

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లు :
రూ. 1099 ప్రీపెయిడ్ ప్లాన్ : రిలయన్స్ జియో రూ. 1,099 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ (నెలకు రూ. 149) అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో వెల్‌కమ్ ఆఫర్ కూడా ఉంది. యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాకు యాక్సెస్ అందిస్తుంది.

రూ. 1499 ప్రీపెయిడ్ ప్లాన్ : రిలయన్స్ జియో రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ (నెలకు రూ. 199) అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో వెల్‌కమ్ ఆఫర్ కూడా ఉంది. మొబైల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాకు యాక్సెస్ అందిస్తుంది.

Netflix password sharing ends in India_ List of Jio and Airtel plans offering free Netflix subscription

జియో పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్లు :
జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : రిలయన్స్ జియో ప్లాన్ నెలకు ఉదారంగా 100GB డేటాను అందిస్తుంది. 3 ఫ్యామిలీ సిమ్‌లకు ఒక్కోదానికి అదనంగా 5GB డేటాను అందిస్తుంది. జియో యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు. అదనంగా, ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో యాప్‌లకు ఫ్రీ సభ్యత్వాలు ఉన్నాయి. ఇతర జియో ప్లాన్‌ల మాదిరిగానే.. యూజర్లు JioTV, JioCinema, JioCloud వంటి జియో యాప్‌లకు ఫ్రీ యాక్సస్ కూడా పొందవచ్చు.

జియో రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ 300GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు ఉచిత సభ్యత్వాలను అందిస్తుంది. ఇందులో ఎంపిక చేసిన నగరాల్లో అంతర్జాతీయ రోమింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే, అదనపు SIM కార్డ్‌లతో కూడిన ఫ్యామిలీ ప్లాన్‌ని అందించదు.

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ప్లాన్ :
రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో 150GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌లకు ఫ్రీ సభ్యత్వాలను పొందవచ్చు.

రూ. 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ 200GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMS, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు ఫ్రీ సభ్యత్వాలను అందిస్తుంది.

Read Also : Skoda : 2023 ఆగస్టు కార్నివాల్‌ సేల్.. కొత్త స్కోడా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ కారు ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ట్రెండింగ్ వార్తలు