Orkut గుర్తుందా? 2020లో ట్రెండింగ్.. నెటిజన్లందరూ గుర్తుచేసుకుంటున్నారు!

  • Publish Date - July 4, 2020 / 07:19 PM IST

సాంకేతికపరంగా ఎన్నో విప్లమాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన ఎన్నో సోషల్ ప్లాట్ ఫాంలు కాలక్రమేణా పోటీతత్వ వాతావరణంలో అంతరించిపోతున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన అనేక సర్వీసుల్లో చాలావరకు షట్ డౌన్ చేసేసింది. ఫేస్‌బుక్ రాక ముందు అప్పట్లో Orkut అంటే ఆ క్రేజే వేరు. గూగుల్ జీమెయిల్ ఉన్న ప్రతిఒక్కరూ Orkut సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు. కొత్త, పాత స్నేహితులను అందరిని ఒకే వేదికపై కలిసే వారదిలా Orkut ఉండేది.


ఈ సర్వీసును 2008లో ప్రవేశపెట్టారు. ఈ వెబ్‌సైట్‌ క్రియేటర్ గూగుల్ ఉద్యోగి Orkut Büyükkökten పేరు దీనికి పెట్టారు. 2008లో భారతదేశం, బ్రెజిల్‌లో అత్యధికంగా విజిట్ చేసిన వెబ్‌సైట్లలో Orkut ఒకటిగా నిలిచింది. ఆ తర్వాతి రోజుల్లో ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్క్ లు అందుబాటులోకి రావడంతో గూగుల్ ఈ Orkut సర్వీసును 2014 సెప్టెంబర్ 30న షట్ డౌన్ చేసేంది. అప్పటినుంచి Orkut అంతరించిపోయింది.

ఇన్నేళ్ల తర్వాత 2020లో మళ్లీ Orkut ట్రెండింగ్ అవుతోంది. అప్పట్లో ఆన్ లైన్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకున్న Orkut మధుర క్షణాలను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ Orkut అకౌంట్ వినియోగించిన వారంతా ఇప్పుడు 13 ఏళ్ల నాటి ఈ Orkut నాటి అందమైన క్షణాలను 2020లో నెమరవేసుకుంటున్నారు.

ఆన్ లైన్‌లో Orkut అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అప్పటి Orkut మెమెరీలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మెమెలను ట్విట్టర్ వేదికగా ట్వీట్లను షేర్ చేస్తున్నారు. ఆనాటి Orkut ప్లాట్ ఫాంను మిస్ అవుతున్నామనే భావనతో మెమీలను షేర్ చేస్తున్నారు.


సోషల్ మీడియాలో Orkut భారత దేశంలో ఒక విప్లవమనే చెప్పాలి.. Orkut ద్వారా సోషల్ మీడియా పునాదులు ఇండియాలో పడితే.. Facebook ద్వారా సోషల్ మీడియా అగ్ర స్థాయికి దూసుకెళ్లిందనే ప్రతిఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో జీవితం ఎంతో కష్టంగా ఉండేవి.. డేటా మాత్రం ఖరీదైనది.. సోషల్ మీడియా కూడా పరిమితంగానే ఉండేది.. అప్పుడు Orkut అనే సోషల్ ప్లాట్ ఫాం అందరిని అలరించిందని గుర్తుచేసుకుంటున్నారు. అంతేకాదు.. ఇలాంటి మరెన్నో అంశాలకు సంబంధించి నెటిజన్లు ఫన్నీ మెమీలను షేర్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు