Harley Davidson Livewire : హార్లే-డేవిడ్సన్ నుంచి ఎలక్ట్రిక్ బైక్. ధర రూ. 16.41 లక్షలు

అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. తాజాగా ఎలక్ట్రిక్ లైవ్‌వైర్ వన్ బైక్ ను విడుదల చేసింది. హార్లే-డేవిడ్సన్ లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ బైక్ తయారీని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చింది.

Harley Davidson Livewire

Harley Davidson Livewire : అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. తాజాగా ఎలక్ట్రిక్ లైవ్‌వైర్ వన్ బైక్ ను విడుదల చేసింది. హార్లే-డేవిడ్సన్ లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ బైక్ తయారీని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చింది.

ఈ బైక్ ఫీచర్లను పరిశీలిస్తే

78 మెగావాట్స్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉండే ఈ బైక్ 3.0 నుంచి 3.0 సెకండ్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 235 కిలోమీటర్లుగా ఉంది. 15.5 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ ఫుల్ ఛార్జ్ చేస్తే 129 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పెట్రోల్ వెహికల్ లాగానే దీని పికప్ ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే.. 21,999 డాలర్లు (రూ.16.41 లక్షలు) గా ఉంది.

ఇతర బైక్ లతో పోల్చితే దీని బ్యాటరీ చాలా త్వరగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. 60 నిమిషాల్లో బ్యాటరీ గరిష్ట సామర్ధ్యానికి (100%) చేరుకుంటుంది. ఇక 45 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జింగ్ ఫిల్ అవుతుంది. 20% నుంచి – 80% కి చేరాలి అంటే 30 నిమిషాల సమయం పడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు..