కొత్త ఏడాదిలో ఖతర్నాక్ ఫోన్లు.. రూ.40వేల లోపు టాప్ 5 ఫోన్లు, మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వొచ్చు!
New Year 2026 : రూ. 40వేల కన్నా తక్కువ ధరలో 5 స్మార్ట్‌ఫోన్‌లు మీకోసం.. ఈ మోడళ్లు డిస్‌ప్లేలు, కెమెరాలు, ఫీచర్లలో కేక.. మీకు ఇష్టమైనవారికోసం ఇప్పుడే కొనేసుకోండి.
5 Best Phones 40K (Image Credit to Original Source)
- 2026 కొత్త ఏడాదిలో స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?
- అద్భుతమైన ఫీచర్లతో 5 క్రేజీ స్మార్ట్ ఫోన్లు మీకోసం
- రూ.40వేల లోపు ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి
Smart Phones Under Rs.40,000 : కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొందామని చూస్తున్నారా? 2026 ఏడాదిలో మీ ప్రియమైన వారికి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. మీ బడ్జెట్ ధరలో రూ. 40వేల లోపు 5 అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ లిస్టులో వివో వి60, ఒప్పో K13 టర్బో ప్రో, రియల్‌మి 15 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ 5, ఐక్యూ నియో 10 ఉన్నాయి. ప్రతి ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ, ప్రాసెసింగ్ పవర్, కెమెరా పర్ఫార్మెన్స్, బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసుకుని మీకు ఇష్టమైనవారికి గిఫ్ట్ ఇచ్చేయండి.
వివో V60 (రూ. 36,999) :
వివో V60లో 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ 1B కలర్లకు సపోర్టు ఇస్తుంది. 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఉంటుంది. క్వాల్కమ్ SM7750-AB స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 90W వైర్డ్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీ ఉంటుంది. ఇమేజింగ్ కోసం ఫోన్ 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఒప్పో K13 టర్బో ప్రో (రూ. 34,999) :
ఒప్పో K13 టర్బో ప్రో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1B కలర్ ఆప్షన్లు, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాల్‌కామ్ SM8735 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీ ఉంది. కెమెరా హార్డ్‌వేర్‌లో 50MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 16MPసెల్ఫీ కెమెరా ఉన్నాయి.
రియల్‌మి 15 ప్రో (రూ. 35,999):
రియల్‌మి 15 ప్రో ఫోన్ 6.8-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో 1B కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 6500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్కమ్ SM7750-AB స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP + 50MP డ్యూయల్ రియర్ సెటప్, 50MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.

5 Best Phones 40K Price (Image Credit to Original Source)
వన్‌ప్లస్ నార్డ్ 5 (రూ. 33,999) :
వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83-అంగుళాల స్విఫ్ట్ అమోల్డ్ డిస్‌ప్లే, 1B కలర్స్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 6800mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరా స్పెసిఫికేషన్లలో 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఐక్యూ నియో 10 (రూ. 38,999) :
ఐక్యూ నియో 10 ఫోన్ 1B కలర్ ఆప్షన్లలో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 4400 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. క్వాల్‌కామ్ SM8735 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 120W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
