EPFO Covid-19 Advance : ఈపీఎఫ్ఓ నుంచి ‘కోవిడ్-19 అడ్వాన్స్‌’ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే!

EPFO Covid-19 Advance : కొవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

EPFO Covid-19 Advance : ఈపీఎఫ్ఓ నుంచి ‘కోవిడ్-19 అడ్వాన్స్‌’ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే!

No more Covid-19 advances from EPFO ( Image Source : Google )

EPFO Covid-19 Advance : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇకపై తమ సభ్యులకు కోవిడ్-19 అడ్వాన్స్‌లను అందించబోమని ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ వేళ వైద్య, ఆర్థికపరమైన అవసరాలు తీర్చేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ఇది మినహాయింపు పొందిన ట్రస్ట్‌లకు కూడా వర్తిస్తుంది. తదనుగుణంగా మీ సంబంధిత అధికార పరిధిలోకి వచ్చే అన్ని ట్రస్ట్‌లకు తెలియజేస్తున్నామని ఈపీఎఫ్ఓ ​​ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది ఇంతకుముందు, కోవిడ్-19 వల్ల కలిగే ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులు రెండుసార్లు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మహమ్మారి మొదటి వేవ్ సమయంలో ఈపీఎఫ్ఓ తమ ఈపీఎఫ్ సభ్యుల కోసం అడ్వాన్స్‌ పీఎఫ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మే 31, 2021 రెండవ వేవ్ ప్రారంభ సమయంలో రెండో అడ్వాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Whatsapp Calling Features : వాట్పాప్ యూజర్లకు పండుగే.. 3 మేజర్ కాలింగ్ ఫీచర్లు.. 32 మందితో వీడియో కాల్స్, ఆడియోతో స్ర్కీన్ సేరింగ్..!

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) ద్వారా మొదటి అడ్వాన్స్‌ను మార్చి 2020లో ప్రవేశపెట్టారు. జూన్ 2021లో కార్మిక మంత్రిత్వ శాఖ మరో నాన్-రిఫండబుల్ అడ్వాన్స్‌ని అందించింది. అయితే, ఈ సదుపాయం ప్రారంభంలో ఈపీఎఫ్ సభ్యులు ఒక్క అడ్వాన్స్‌ని మాత్రమే తీసుకోవడానికి అనుమతించారు. కానీ, మహమ్మారి సమయంలో అదనపు సపోర్టు అందించేందుకు ఈ విధానంలో కొన్ని మార్పులు చేసింది.

ఈపీఎఫ్ అనేది ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను అందించడానికి రూపొందించింది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మారినప్పుడు ఈపీఎఫ్ ఫండ్స్ మధ్య సజావుగా బదిలీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ చందాదారులు వివిధ పరిస్థితులలో తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు నిధులను ఉపసంహరించుకునే ముందు కొన్ని షరతులను తప్పక తెలుసుకోవాలి.

  • హౌసింగ్ లోన్ కోసం
  • ఫ్యాక్టరీ లాక్ చేసి ఉంటే లేదా మూసివేసినప్పుడు
  • పీఎఫ్ సభ్యులు లేదా కుటుంబ సభ్యుల అనారోగ్యం కోసం
  • ఖాతాదారుడి వివాహం, కుమారుడు, కుమార్తె, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం
  • పిల్లల పోస్ట్ మెట్రిక్యులేషన్ విద్య కోసం
  • ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు
  • సంస్థలో విద్యుత్ కోత
  • సబ్‌స్క్రైబర్ శారీరక వైకల్యంతో ఉండి పరికరాలను కొనుగోలు చేయడం
  • పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు
  • వరిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టడం కోసం

పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హతను ముందుగా చెక్ చేయాల్సి ఉంటుంది. అర్హతను నిర్ధారించిన తర్వాత సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా వారి వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. వారి UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)ని యాక్టివ్ చేయాలి. పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణకు ఈపీఎఫ్ ఫారమ్‌ను నింపాలి. పూర్తి ఉపసంహరణ పదవీ విరమణ తర్వాత లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలు ఉద్యోగం (జాబ్ పోయినప్పుడు) లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ ​​క్లెయిమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే? :

  • యూఏఎన్ లాగిన్ వివరాలను ఉపయోగించి సభ్యుల ఇంటర్‌ఫేస్‌కు లాగిన్ చేయండి.
  • యూఏఎన్‌లో పేర్కొన్న విధంగా సేవా అర్హత, కేవైసీ అన్ని షరతులను అంగీకరించండి.
  • సంబంధిత క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.
  • యూఐడీఏఐతో రిజిస్టర్డ్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఉపయోగించి వివరాలను అథెంటికేట్ చేయండి.
  • ఆన్‌లైన్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించండి.

Read Also : Infinix Note 40 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చేవారమే లాంచ్.. కీలక ఫీచర్లు, డిజైన్ వివరాలు ఇవే!