Aadhar OTP Verification Process
Aadhar OTP Verification : ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. అతి త్వరలో ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి భారీ మార్పులు ఉండొచ్చు. భారతీయ (Aadhar OTP Verification) పౌరులకు ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం. వ్యక్తిగత పనుల దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది.
అయితే, ప్రత్యేకించి ఆధార్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త నిబంధనలు తీసుకురావాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) యోచిస్తున్నట్లు సమాచారం. ఆధార్ వినియోగదారుల సేఫ్టీ, ప్రైవసీ కోసం త్వరలో వారి ఆధార్ నంబర్ లేదా వ్యక్తిగత వివరాలను షేర్ చేయకుండా ఆఫ్‌లైన్ కేవైసీ పూర్తి చేయొచ్చునని మీడియా నివేదికలు తెలిపాయి. ఆధార్ ఆధారిత కేవైసీలో రాబోయే మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
OTP, బయోమెట్రిక్స్ అవసరం లేదా? :
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బయోమెట్రిక్స్ లేదా OTP అవసరం త్వరలో ఎత్తేస్తే అవకాశం కనిపిస్తోంది. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం QR కోడ్, PDF ఫైల్స్ వినియోగం అందుబాటులోకి రానుంది. ఆధార్ కార్డు వినియోగదారులు ప్రస్తుతం ఎలక్ట్రానిక్, బయోమెట్రిక్, ఆఫ్‌లైన్ కేవైసీ కోసం తమ ఆధార్ నంబర్‌ను షేర్ చేయాల్సి అవసరం ఉంది. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే.. ఇకపై OTP అవసరం ఉండదు.
Read Also : Children Aadhaar Card : మీ పిల్లల ఆధార్ కార్డ్‌లో ఈ అప్‌డేట్ చేయకపోతే డియాక్టివేట్.. UIDAI వార్నింగ్..!
పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ అప్‌డేట్ :
7 ఏళ్ల వయస్సు వచ్చిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాలని తల్లిదండ్రులు, సంరక్షకులను ప్రభుత్వం కోరింది. IANS నివేదిక ప్రకారం.. 7 ఏళ్ల వయస్సు నిండినప్పటికీ, ఇంకా ఆధార్‌లో వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయని పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) పూర్తి చేయాల్సి ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
5ఏళ్లు రాగానే పిల్లల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి :
సాధారణంగా 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం వారి ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ బయోమెట్రిక్‌లను సేకరించరు. ఎందుకంటే.. ఆ వయస్సులో బయెమెట్రిక్ పూర్తి స్థాయిలో ఉండవు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పిల్లలకి 5 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు వారి ఆధార్‌లో ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫోటోను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడం ద్వారా స్కూల్ అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు రిజిస్టర్, స్కాలర్‌షిప్ బెనిఫిట్స్, DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) పథకాలు వంటి సర్వీసులను పొందవచ్చు. తల్లిదండ్రులు, గార్డియన్లు, తమ పిల్లలు, వార్డుల బయోమెట్రిక్‌లను ఆధార్‌లో వెంటనే అప్‌డేట్ చేయాలి.