Noise launches its first 4G calling smartwatch, Noise Voyage
Noise Voyage Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అయితే, ఆసక్తిగల కస్టమర్ల కోసం భారత మార్కెట్లోకి నాయిస్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. అదే.. నాయిస్ వాయేజ్ 4G కాలింగ్ స్మార్ట్‌వాచ్.. నాయిస్ తన స్మార్ట్‌వాచ్‌లలో 4జీ ఇ-సిమ్ సామర్థ్యాలను అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ వంటి భారత అగ్ర టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. నాయిస్ వాయేజ్ స్మార్ట్‌వాచ్ ముందస్తు బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈరోజు (GoNoise.com)లో డిసెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్ (GoNoise.com) రెండింటిలోనూ అమ్మకానికి వస్తుంది.
4జీ సపోర్టుతో కాలింగ్స్ :
అద్భుతమైన లోహ నిర్మాణాన్ని కలిగి ఉంది. 1.4″ రెటినా అమోల్డ్ డిస్‌ప్లే క్రిస్టల్-క్లియర్ విజువల్స్ నేచురల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. నాయిస్ వాయేజ్ పొజిషన్ ట్రాకింగ్ కోసం జీపీఎస్ గ్లోనాస్ ఫీచర్ అందిస్తుంది. వినియోగదారులు తమ ప్రయాణాన్ని సజావుగా ప్రయాణించేలా చేస్తుంది. అధునాతన ఆరోగ్యం, యాక్టివిటీ ట్రాకింగ్ మెట్రిక్‌లతో నాయిస్ వాయేజ్ సౌలభ్యంతో కచ్చితమైన సినర్జీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లోని 4జీ కాలింగ్ సామర్థ్యాలతో కాల్స్ చేసేందుకు అనుమతిస్తాయి.
Noise Voyage smartwatch
నాయిస్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ :
స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ కానప్పుడు 4జీ కాలింగ్ స్మార్ట్‌వాచ్ రోజువారీ పనులు, హృదయ స్పందన రేటును కూడా అందిస్తుంది. నాయిస్ వాయేజ్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ప్రత్యేక ఆఫర్‌ను ఆస్వాదించవచ్చు. దీని ద్వారా వారికి 3 నెలల ఉచిత కాలింగ్ అనుభవాన్ని అందించవచ్చు.
రెండు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఇ-సిమ్ సర్వీసు ప్రారంభంపై నాయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రి మాట్లాడుతూ.. స్మార్ట్‌వాచ్‌లకు 4జీ ఇ-సిమ్ సామర్థ్యాలను తీసుకువచ్చామన్నారు. నాయిస్ వాయేజ్ లాంచ్ ద్వారా సాంకేతికతను వినియోగించుకునేలా వినియోగదారులకు పూర్తి సామర్థ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు.