Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టడం ఇంత ఈజీనా.. ఇంజనీరింగ్‌తో పనిలేదని నిరూపించిన డిగ్రీ స్టూడెంట్.. రూ. 50 లక్షల జీతం!

Non Engineering Student : చదివింది డిగ్రీ.. చేసేది ఐటీ జాబ్.. నెలకు లక్షల్లో జీతం.. సాధారణ డిగ్రీతో ఎలాంటి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అతిపెద్ట టెక్ దిగ్గజం గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు. ఇదేలా సాధ్యపడిందో అతడి మాటల్లోనే తెలుసుకుందాం.

Non Engineering Student : టెక్ కంపెనీల్లో జాబ్.. అందులోనూ గూగుల్ (Google) వంటి అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలో జాబ్ అంటే.. అంత ఈజీ కాదనే చెప్పాలి. ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా సాధించలేని అతిపెద్ద ఫీట్.. కేవలం ఒక సాధారణ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ సాధించాడు. గూగుల్‌లో ఉద్యోగం (Google Jobs in India) చేయాలనేది ప్రతిఒక్క ఇంజినీరింగ్ స్టూడెంట్ కల.. కానీ, ఆ కలను సుసాధ్యం చేసి చూపించాడు (Non Engineering Student) నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతడే.. పూణేలోని MIT-వరల్డ్ పీస్ యూనివర్శిటీ విద్యార్థి అయిన హర్షల్ జుయికర్.

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఐటీ జాబ్ కొట్టేశాడు. గూగుల్‌లో ఏడాదికి రూ. 50 లక్షల ప్యాకేజీతో అసాధారణమైన మైలురాయిని సాధించాడు. ఒక సాధారణ డిగ్రీ స్టూడెంట్‌కు ఇదేలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరికి హర్షల్ ఆదర్శంగా నిలిచాడు. తన అసాధారణమైన కోడింగ్ స్కిల్స్ సాయంతో, టెక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కేవలం ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదని నిరూపించాడు.

ఈ విజయం మాములు విజయం కాదు.. అందరికి సాధ్యపడేది కాదు.. ఎందుకంటే.. హర్షల్ ఒక నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.. తనకు ఎలాంటి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ ఐటీ కంపెనీల్లో రాణించాలనే పట్టుదల, టెక్నాలజీపై అతడికి ఉన్న మక్కువే గూగుల్ కంపెనీలో జాబ్ సంపాదించిపెట్టింది. తనలోని ప్రతిభను గుర్తించి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో MSc పూర్తి చేశాడు. అలా తన స్కిల్స్ ఎప్పటికప్పుడూ పెంచుకుంటూ అనేక మందికి హర్షల్ ప్రేరణగా నిలిచాడు. ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనభరిస్తే.. అసాధారణమైన కెరీర్ అవకాశాలు లభిస్తాయని నిరూపించాడు. ఐటీ రంగం పట్ల తనకు ఉన్న అభిరుచి, కృషి, పట్టుదలకు హర్షల్ ప్రయాణం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. అసలు, టెక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే ఆలోచన ఎలా మొదలైంది.. తన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాలను హర్షల్ జుయికర్ మాటల్లోనే తెలుసుకుందాం..

టెక్ పరిశ్రమలో ప్రయాణం మొదలైందిలా.. 
‘నేను చదివింది.. బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) మాత్రమే.. ఆ సమయంలో టెక్నాలజీ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆధునిక టెక్ ప్రపంచంలో ముందుకు సాగాలంటే నా నైపుణ్యాలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని గ్రహించాను. ఇంజనీరింగ్ నేపథ్యం లేకపోయినా.. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చునని అర్థమైంది. చదివిన విద్యకు ఇది సరిపోదని తెలిసి సొంతంగా కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను’ అని హర్షల్ జుయికర్ తన టెక్ ప్రయాణాన్ని చెప్పుకొచ్చాడు.

Read Also : Google Job Resume Tips : మీ రెజ్యూమ్‌‌లో ఈ 2 పెద్ద తప్పులు చేస్తే.. మీకు గూగుల్‌ ఉద్యోగం ఇవ్వదు.. ఇలా ప్రీపేర్ చేస్తే జాబ్ పక్కా..!

అంతేకాదు.. పూణేలోని MIT-WPU నుంచి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు టెక్ నిపుణుల నుంచి ఫండమెంటల్స్‌పై ట్రైనింగ్ పొందాను. భారీ డేటాసెట్‌లపై పనిచేయడం, గణాంక అల్గారిథమ్‌లను విశ్లేషించడం, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రిడిక్టివ్ మోడల్‌లను రూపొందించడం వంటివి చేశానని హర్షల్ తెలిపాడు. మొత్తంమీద, కంప్యూటర్ సైన్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో అకడమిక్ నేపథ్యంతో పాటు సొంతంగా నేర్చుకోవడం కూడా ప్లస్ అయిందని చెప్పాడు. టెక్నాలజీ రంగంలో వేగంగా మారిపోతున్న పరిస్థితులకు తగినట్టుగా తనను తాను అప్‌డేట్ చేసుకున్నాడు. అదే హర్షల్ టెక్ పరిశ్రమలోకి విజయవంతంగా మారడంలో కీలకపాత్ర పోషించాయి.

నా కల సాకారం అయినట్టే..
‘నా కృషి, అంకితభావమే ఇంతంటి విజయాన్ని తెచ్చిపెట్టాయంటే నమ్మలేకపోయాను. ఇన్నోవేషన్, అత్యాధునిక ప్రాజెక్ట్‌లకు పేరుగాంచిన టెక్ దిగ్గజం గూగుల్‌లో హై ప్యాకేజీతో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే కొత్త సవాళ్లను స్వీకరించడానికి మరింత ఆసక్తిని కలిగించింది‘ అని హర్షల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి గూగుల్ వంటి టెక్ ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక ప్రపంచానికి దోహదపడటానికి వేచి ఉండలేకపోయానని అన్నాడు.

గూగుల్‌లో ఉద్యోగం అందుకే వచ్చింది..
సాంకేతికత, ఆవిష్కరణల పట్ల నిజమైన మక్కువ ఉన్నవారి కోసం గూగుల్ వంటి టెక్ కంపెనీలు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. అదే గూగుల్ దృష్టిలో పడేలా చేసింది. ఈ విషయాల పట్ల నా అభిరుచి నా ఎంపికలో కీలక పాత్ర పోషించింది. అలాగే, గూగుల్‌తో ఇంటర్న్‌గా పనిచేసే అవకాశం నాకు లభించింది. తద్వారా గూగుల్‌తో చాలా సన్నిహితంగా పనిచేసిన అనుభవాన్ని పొందాను’ అని హర్షల్ తన ఉద్యోగ అనుభవాలను చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే.. ఐటీ రంగంలో వర్క్ కల్చర్ అర్థం చేసుకోవడానికి, పరిశ్రమలోని కొంతమంది గొప్ప వ్యక్తులతో సంభాషించే అవకాశాన్ని పొందడానికి సాయపడిందని తెలిపాడు.

Pune student lands Rs 50 lakh salary package at Google

అలా తన స్కిల్స్ మరింత పెంచుకోవడానికి సాయపడిందన్నాడు. గూగుల్‌తో నా ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా విషయాలను నేర్పించింది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఫ్యూచర్, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వనరులకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ప్రతి రంగంలో సొంత మార్గంలో సవాలుగా ఉంటుందని హర్షల్ జుయికర్ వివరించాడు. కానీ, ఆ సవాళ్లను అధిగమించి, సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను అందించడమే నిజమైన లక్ష్యమని పూణే విద్యార్థి తెలిపాడు.

Read Also : Tech Jobs Tips : టెక్ కంపెనీల్లో జాబ్ కొట్టాలంటే.. మీ జాబ్ అప్లికేషన్ ఇలా ఉండాలి.. తొందరగా కాల్ వస్తుంది.. ఉద్యోగం గ్యారెంటీ..!

గూగుల్ ఇంటర్వ్యూ అనుభవం ఎలా ఉందంటే? :
గూగుల్ ఇంటర్వ్యూ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. గూగుల్ ఇంటర్వ్యూను క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కానీ, సరైన విధానాన్ని ప్రదర్శించడం ద్వారా కచ్చితంగా ఈ సవాళ్లను అధిగమించవచ్చు. గూగుల్ వంటి పెద్ద కంపెనీలు టెక్ పరిశ్రమలో అభిరుచి, అంకితభావం, రాణించగల సామర్థ్యం ఉన్న సరైన అభ్యర్థిపై కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాయి. అందుకే, గూగుల్ కంపెనీ నియామక ప్రక్రియ చాలా కఠినమైనది. కానీ, సరైన వైఖరి, విధానంతో ఛేదించవచ్చు’ అని హర్షల్ వివరించాడు.

గూగుల్‌లో ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు సలహా :
ఇంజినీరింగ్ నేపథ్యం లేకుండా గూగుల్‌లో లేదా టెక్ పరిశ్రమలో పనిచేయాలని చూస్తున్న ఔత్సాహిక విద్యార్థులు భవిష్యత్ విధానాన్ని అనుసరించాలని హర్షల్ సలహా ఇస్తున్నారు. టెక్నాలజీ రంగంలో కొత్త మార్పులకు తగినట్టుగా తమలోని టెక్నికల్ స్కిల్స్ అప్‌డేట్ చేసుకోవాలి. ఈ మార్పులకు అనుగుణంగా పోటీతత్వం, విజయవంతంగా ఉండటానికి కెరీర్ మార్గాన్ని తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం తప్పనిసరిగాపూణే విద్యార్థి సూచించాడు.

గూగుల్‌తోనే కాదు.. ఆ తర్వాతి కెరీర్‌పైనా దృష్టి :
క్వాంటమ్ కంప్యూటింగ్, AI రంగాలలో సంచలనాత్మక పరిశోధన, ఆవిష్కరణలకు గణనీయ సహకారాన్ని అందించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నానని హర్షల్ సూచించాడు. అందుకు తగినట్టుగా భవిష్యత్తుపై ప్రతిష్టాత్మక దృష్టిని కలిగి ఉండాలన్నాడు. టెక్ పరిశ్రమలో డేటాను ఎలా ప్రాసెస్ చేస్తారు. సంక్లిష్ట సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది తెలిసి ఉండాలన్నాడు. విభిన్న పరిశ్రమలలో కొత్త విధానాన్ని విప్లవాత్మకంగా మార్చగల గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీల అభివృద్ధికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నానని హర్షల్ జుయికర్ తన అనుభవాలను వ్యక్తపరిచాడు.

Read Also : Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టిన నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్.. రూ.50 లక్షల జీతమట.. అదేలా సాధ్యం.. అతడేం చేశాడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు