Tech Jobs Tips : టెక్ కంపెనీల్లో జాబ్ కొట్టాలంటే.. మీ జాబ్ అప్లికేషన్ ఇలా ఉండాలి.. తొందరగా కాల్ వస్తుంది.. ఉద్యోగం గ్యారెంటీ..!

Tech Jobs Tips : టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగం కోసం అప్లయ్ చేసుకున్నారా? ఈ టిప్స్ పాటిస్తే అభ్యర్థులు తొందరగా జాబ్ పొందవచ్చునని గూగుల్ మాజీ HR ఎగ్జిక్యూటివ్ సూచించారు.

Tech Jobs Tips : టెక్ కంపెనీల్లో జాబ్ కొట్టాలంటే.. మీ జాబ్ అప్లికేషన్ ఇలా ఉండాలి.. తొందరగా కాల్ వస్తుంది.. ఉద్యోగం గ్యారెంటీ..!

Ex-Google HR reveals how to make your job application stronger, shares tips for getting noticed faster

Tech Jobs Tips : గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2022లో ట్విట్టర్ (X) కంపెనీ యజమానిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌లో భారీ తొలగింపులు చేపట్టారు. ఆ తర్వాత, ఇతర టెక్ దిగ్గజాలైన Google, Microsoft, Amazon, Meta కంపెనీలు కూడా తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టాయి. ఆర్థికపరంగా పట్టు సాధించేందుకు కంపెనీల్లో భారీ తొలగింపులను ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యోగాల తొలగింపుల కారణంగా టెక్ జాబ్ మార్కెట్ మరింత పోటీవాతారణం నెలకొంది.

లింక్‌డిన్ వంటి జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లక్షలాది మంది కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. కొంతమందికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన తర్వాత కంపెనీ రిక్రూటర్ల నుంచి కాల్స్ తొందరగా రావడం లేదు. అలాగే, ఇంటర్వ్యూ కాల్ పొందడంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వ్యక్తులకు సాయం చేయడానికి, గూగుల్ మాజీ హెచ్‌ఆర్ (DoorDash) రిక్రూటర్ నోలన్ చర్చ్ ఆన్‌లైన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా చేయాల్సిన మొదటి విషయాలను వెల్లడించారు.

Read Also : Infinix GT 10 Pro Launch : రంగులు మార్చే బ్యాక్ ప్యానల్‌తో ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు..!

జాబ్ అప్లికేషన్‌ ఎలా ఉండాలంటే.. మాజీ హెచ్ఆర్ మాటల్లోనే.. :
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత.. అతను/ఆమె లింక్‌డిన్ మెసేజ్ లేదా కంపెనీ రిక్రూటర్, CEOకి ఇమెయిల్‌ను పంపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అభ్యర్థి ఉద్యోగ దరఖాస్తును తొందరగా గుర్తించడంలో సాయపడుతుంది. కంపెనీలు ఒకే రోజులో వందలాది ఉద్యోగ దరఖాస్తులను స్వీకరిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఒకరి ఉద్యోగ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ, గూగుల్ హెచ్ఆర్ సూచించిన ప్రకారం.. తమ ఉద్యోగ దరఖాస్తును ఇలా ఈమెయిల్ ద్వారా పంపడం ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు.

డోర్‌డాష్‌లో పని చేస్తున్నప్పుడు.. కంపెనీ సీఈఓ టోనీ జు.. తరచూ అలాంటి ఇమెయిల్‌లను చూసేవారని, వాటిని ప్రతిసారీ తనకు ఫార్వార్డ్ చేసేవాడని చర్చ్ చెప్పారు. ఇలాంటి 90 శాతం కేసులలో లింక్‌డిన్, ఇమెయిల్ లేదా మెసేజ్ అనుసరించిన అభ్యర్థులకు కంపెనీ నుంచి ఎక్కువగా కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఇలాంటి ఇమెయిల్‌లు, మెసేజ్ లను పంపే ముందు సంస్థ ఎంత పెద్దది అనేదాని గురించి ఆందోళన చెందవద్దు.

Ex-Google HR reveals how to make your job application stronger, shares tips for getting noticed faster

Ex-Google HR reveals how to make your job application stronger, shares tips for getting noticed faster

ఉదాహరణకు.. ఒక అభ్యర్థి అమెజాన్‌కు దరఖాస్తు చేసినప్పుడు.. ఆండీ జాస్సీకి ఇమెయిల్ పంపాలనుకుంటే.. భయపడకూడదని అన్నారు. ఎగ్జిక్యూటివ్‌లకు టాలెంట్ మార్కెట్‌గా ఉన్న కాంటినమ్‌కి ఇప్పుడు సీఈఓ అయిన చర్చ్.. పెద్ద కంపెనీలను చూసి భయపడవద్దని అభ్యర్థులను కోరారు. మీరు పంపిన ఈ-మెయిల్ చదివేది కాకపోవచ్చు. కానీ, రిక్రూటర్ల టీంలో ఎవరైనా దానిని చూసే అవకాశం ఉంది. అప్పుడు, HR లేదా VPకి కూడా ఫార్వార్డ్ చేస్తారని చర్చ్ పేర్కొన్నారు.

గూగుల్‌లో ఉద్యోగాల కోత :
గూగుల్ ఈ ఏడాది జనవరిలో 12వేల మందిని తొలగించాలని నిర్ణయాన్ని ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అన్నింటికంటే.. టెక్ దిగ్గజం తన ఉద్యోగులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందించింది. చాలా మంది టెక్కీలు గూగుల్ కంపెనీలో పనిచేయాలని కలలు కంటుంటారు. ఇటీవల, గూగుల్ మ్యాప్‌ల ప్రొడక్టులలో యాప్‌ను ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో Waze మ్యాపింగ్ యాప్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

గూగుల్ జియో యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న క్రిస్ ఫిలిప్స్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇటీవలి తొలగింపులపై మాట్లాడుతూ.. Waze ప్రకటనదారులకు మెరుగైన, మరింత అనుభవాన్ని అందించడానికి Waze ప్రస్తుత ప్రకటనల వ్యవస్థను గూగుల్ ప్రకటనల టెక్నాలజీకి మార్చడం జరిగింది. ఈ కొత్త అప్‌డేట్ కారణంగా Waze యాడ్స్ మానిటైజేషన్‌పై పనిచేసే ఉద్యోగులను తగ్గించామని పేర్కొంది.

Read Also : MG Comet EV Edition : భలే ఉంది భయ్యా.. ఎంజీ కామెట్ ఈవీ ‘స్పెషల్ గేమర్’ ఎడిషన్‌ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!