Discount on Nothing Phone 2, And other CMF products
Nothing Festive Sale Offers : మీరు నథింగ్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. అందుకు ఇదే సరైన సమయం.. లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్ (Nothing)తమ యూజర్ల కోసం కొన్ని ఫెస్టివల్ ఆఫర్‌లను ప్రకటించింది. పండుగ సేల్ సమయంలో వినియోగదారులు నథింగ్ ఫోన్ (2), నథింగ్ ఇయర్ బడ్స్ (2), ఇటీవలే లాంచ్ అయిన CMF ప్రొడక్టులపై భారీ తగ్గింపులను పొందవచ్చు.
నథింగ్ ఫోన్ (2)పై తగ్గింపు :
మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆన్‌లైన్‌లో తగ్గింపు ధరతో నథింగ్ ఫోన్ (2)ని కొనుగోలు చేయవచ్చు. గ్రే, వైట్ కలర్ ఆప్షన్‌లలో ఆఫ్‌లైన్ స్టోర్‌లను ఎంచుకోవచ్చు.
* రూ. 37,999 (8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ)
* రూ. 38,999 (12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ)
* రూ. 39,999 (12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ)
నథింగ్ ఇయర్ (2)పై డిస్కౌంట్ :
నథింగ్ ఇయర్ (2) ధర తగ్గింపుతో లభిస్తుంది. Flipkart, Myntra దేశంలోని ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రూ. 6,999కు సొంతం చేసుకోవచ్చు. రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. 11.6 మిమీ కస్టమ్ డ్రైవర్‌తో డీప్ బాస్, క్రిస్టల్-క్లియర్ హైస్‌ని అందజేస్తుంది.
Discount on Nothing Phone 2
సీఎంఎఫ్ బడ్స్ ప్రోపై డిస్కౌంట్ :
సీఎంఎఫ్ బడ్స్ ప్రో రూ. 2,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. (TWS)ని ఫ్లిప్‌కార్ట్, (Myntra) నుంచి మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. సీఎంఎఫ్ బడ్స్ ప్రో 11 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. పవర్‌ఫుల్ బాస్ బూస్ట్ డ్రైవర్‌తో వస్తుంది.
సీఎంఎఫ్ వాచ్ ప్రోపై తగ్గింపు
సీఎంఎఫ్ వాచ్ ప్రో ఫ్లిప్‌కార్ట్, మైంత్రా రెండింటిలో రెండు కలర్ ఆప్షన్లలో రూ. 4,499కు సొంతం చేసుకోవచ్చు. సీఎంఎఫ్ వాచ్ ప్రో హెల్త్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. యాక్టివ్‌గా ఉంచడానికి 110 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. మీ అన్ని హాలిడే ఈవెంట్‌ల ద్వారా మిమ్మల్ని కనెక్ట్ చేసేందుకు 13-రోజుల బ్యాటరీ లైఫ్, సులభంగా కాల్-స్విచింగ్ పవర్‌ఫుల్ 1.96″ అమోల్డ్ డిస్‌ప్లే, ప్రయాణంలో వినోదం, అలాగే ఇంటర్నల్ జీపీఎస్, AI-ఆధారిత కాల్ సామర్థ్యాలను పొందవచ్చు.