Nothing Phone (1) : నథింగ్ ఫోన్ (1)లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్.. కెమెరాల్లో ఎన్ని సరికొత్త ఆప్షన్లు వచ్చాయో తెలుసా?

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు నథింగ్ కంపెనీ నుంచి కొత్త నథింగ్ ఫోన్ (1) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. కొద్దినెలల క్రితమే లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ (1)లో అనేక లోపాలు ఉన్నాయని యూజర్లు ఫిర్యాదులు అందాయి.

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు నథింగ్ కంపెనీ నుంచి కొత్త నథింగ్ ఫోన్ (1) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. కొద్దినెలల క్రితమే లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ (1)లో అనేక లోపాలు ఉన్నాయని యూజర్లు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు.. కెమెరా ఫీచర్లలోనూ కొన్ని బగ్స్ ఉన్నట్టు గుర్తించారు. నథింగ్ ఫోన్ (1) లాంచ్ సమయంలో ఎంతగా పాపులారిటీ అయిందో కొనుగోలుదారులు ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలోనూ అనేక లోపాలను ఎదుర్కొన్నారు.

ఇప్పుడా భద్రతా లోపాలన్నింటిని ఫిక్స్ చేస్తూ నథింగ్ కంపెనీ నథింగ్ OS వెర్షన్ 1.1.4 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. జూలైలో ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి నాల్గో అప్‌డేట్. నథింగ్ OS వెర్షన్ 1.1.4 అప్‌డేట్ అనేక రకాల కెమెరాల్లో మార్పులు తీసుకొచ్చింది. సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ సహా మరిన్నింటిని అందిస్తుంది. నథింగ్ OS వెర్షన్ 1.1.4 కెమెరా యాప్‌కు నథింగ్-థీమ్ వాటర్‌మార్క్‌ను యాడ్ చేసేందుకు కొత్త ఆప్షన్ అందిస్తుంది.

Nothing Phone (1) gets new software update with several camera improvements

అదనంగా, అల్ట్రా-వైడ్ కెమెరా కలర్ కాలిబ్రేషన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. మెయిన్, అల్ట్రా-వైడ్ సెన్సార్‌ల మధ్య కలర్ స్టేబులిటీని కూడా పెంచుతుంది. నథింగ్ ఫోన్ (1) కొత్త అప్‌డేట్ ద్వారా అనేక ఇతర కెమెరా అప్‌డేట్స్ అందిస్తోంది. అందులో కదిలే వస్తువులను షూట్ చేస్తున్నప్పుడు స్టేబుల్‌గా ఉండేలా కొత్త మోషన్ డిటెక్షన్ అల్గోరిథం యాడ్ అయింది. అల్ట్రా-వైడ్ మోడ్‌లో HDRని వాడినప్పుడు షూటింగ్ స్పీడ్ కూడా పెంచింది. నైట్ మోడ్ షాట్‌లతో కలర్లను యాడ్ చేసింది.

ముందు కెమెరాలో షార్పర్ నేచురల్ ప్రకాశవంతమైన పోర్ట్రెయిట్‌లు ఉండేలా అప్‌డేట్ చేసింది. నథింగ్ OS వెర్షన్ 1.1.4 3-బటన్ నావిగేషన్ బార్‌కు కొత్త ఆప్షన్ కూడా అందిస్తుంది. LHDC హై-డెఫినిషన్ ఆడియోకు కూడా సపోర్టు అందిస్తుంది. అదనంగా, అప్‌డేట్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్, మెరుగైన ఫేస్ అన్‌లాక్ అల్గారిథమ్, సిస్టమ్ అప్‌డేట్‌ల కోసం కొత్త UI, మెరుగైన థర్మల్ పర్ఫార్మెన్స్, సాధారణ బగ్స్ కూడా ఫిక్స్ చేసింది.

Nothing Phone (1) gets new software update with several camera improvements

కొత్త నథింగ్ OS అప్‌డేట్‌తో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, ఇతర సందర్భాలలో బ్యాటరీ వినియోగాన్ని తగ్గించినట్టుగా కంపెనీ పేర్కొంది. 2023 ప్రారంభంలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌లో నథింగ్ ఫోన్ (1) నథింగ్ OS అప్‌డేట్ వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఏడాది చివరినాటికి అప్‌డేట్ బీటా వెర్షన్‌ను కూడా రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ (1) బేస్ 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 29,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది. 8GB + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 32,999 కాగా, 12Gb + 256GB మోడల్ ధర రూ. 35,999లకు అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nothing Phone (1) : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 28,999లకే నథింగ్ ఫోన్ (1).. మరెన్నో డిస్కౌంట్లు.. రూ.3వేల తగ్గింపు ఆఫర్!

ట్రెండింగ్ వార్తలు