Nothing Phone 3 : నథింగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఏఐ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోందోచ్.. ఇదిగో ప్రూఫ్..!

Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ 3 త్వరలో రాబోతుంది. ఇదే విషయాన్ని కంపెనీ సీఈఓ క్లార్ పీ ప్రకటించారు. ఏఐ ఫీచర్లతో నథింగ్ ఫోన్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలివే

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ లవర్స్‌కు అదిరే న్యూస్.. రాబోయే నెలల్లో నథింగ్ ఫోన్ 3 మోడల్ రాబోతుంది. యూకే ఆధారిత టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ కార్ల్ పీ ప్రకారం.. అతి త్వరలో నథింగ్ ఫోన్ 3 లాంచ్ కానుంది. 2023 నుంచి నథింగ్ ఫోన్ 2 అప్‌‌గ్రేడ్ గత ఏడాదిలోనే లాంచ్ అవుతుందని అందరూ భావించారు.

Read Also : Amazon Sale : ట్రిపుల్ కెమెరా ఫోన్ కావాలా? మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇంకా ధర తగ్గాలంటే..!

అయితే, కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ 2a, నథింగ్ ఫోన్ 2a ప్లస్ మోడళ్లను లాంచ్ చేసింది. గత వెర్షన్ల మాదిరిగానే కంపెనీ నెక్స్ట్ హై-ఎండ్ ఫోన్ గ్లిఫ్ లైటింగ్‌తో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే నథింగ్ ఫోన్ 3 కూడా కొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు.

నథింగ్ ఫోన్ 3 లాంచ్ టైమ్‌లైన్ :
10 నిమిషాల ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌లో ఎక్స్ వేదికగా ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నథింగ్ ఫోన్ 3 లాంచ్ టైమ్‌లైన్‌ను నథింగ్ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. నథింగ్ ఫోన్ 3 2025 Q3లో లాంచ్ కానుంది.

అంటే.. జూలై లేదా సెప్టెంబర్ మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ సమయం కంపెనీ గత స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీలతో సమానంగా ఉంటుంది. నథింగ్ ఫోన్ 2 జూలై 11, 2023న వచ్చింది. ఫస్ట్ జనరేషన్ నథింగ్ ఫోన్ 1 జూలై 21, 2022న అమ్మకానికి వచ్చింది.

గత ఏడాదిలోనే యూకే సంస్థ నథింగ్ ఫోన్ 3 లాంచ్ చేస్తుందని పుకార్లు వచ్చాయి. కానీ, కంపెనీ ఏఐపై దృష్టి సారిస్తోందని కంపెనీ ప్రకటించడంతో మరింత ఆలస్యమైంది. నథింగ్ ఫోన్ 3 గురించి పూర్తి వివరాలు తెలియదు. ఎందుకంటే.. స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు ఇంకా ఆన్‌లైన్‌లో కనిపించలేదు. నథింగ్ ఫోన్ 2 మోడల్ ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌తో పాటు 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీని కలిగి ఉంది.

Read Also : WhatsApp Feature : వావ్.. వాట్సాప్‌లో కిర్రాక్ ఫీచర్.. ఇక ఫుల్ కంట్రోల్ మీ చేతుల్లో.. డేటానే కాదు.. స్టోరేజ్ కూడా సేవ్ చేయొచ్చు..!

ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 2లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. 47W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.