Nothing Phone 3a Lite : నథింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. నథింగ్ ఫోన్ 3a లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Nothing Phone 3a Lite : కొత్త నథింగ్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3a లైట్ వెర్షన్ రిలీజ్ కానుంది. డిజైన్, కెమెరా ఫీచర్లకు సంబంధించి ఓసారి లుక్కేయండి.

Nothing Phone 3a Lite : నథింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. నథింగ్ ఫోన్ 3a లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Nothing Phone 3a Lite

Updated On : October 27, 2025 / 4:33 PM IST

Nothing Phone 3a Lite : కొత్త నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? లండన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. కంపెనీ నథింగ్ ఫోన్ 3a లైట్ అతి త్వరలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. నథింగ్ ఫోన్ 3 సిరీస్‌లో ఇది నాల్గో మోడల్.

ఇప్పటికే నథింగ్ ఫోన్ 3, నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రోలతో (Nothing Phone 3a Lite) ఉన్నాయి. రాబోయే మోడల్ ఇప్పుడు గీక్ బెంచ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించింది. భారత మార్కెట్లో కూడా అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ 3a లైట్ డిజైన్, స్పెసిఫికేషన్లు, కెమెరా సెటప్, ధర అంచనాకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 3a లైట్ డిజైన్ (అంచనా) :
డిజైన్ విషయానికి వస్తే.. నథింగ్ సిగ్నేచర్ మినిమలిస్ట్, ట్రాన్స్‌పరెంట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 3a లైట్ ఫ్లాట్ ఎడ్జెస్, సిమెట్రిక్ బెజెల్స్, బ్యాక్ సైడ్ సెంట్రల్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్‌ కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ గ్లిఫ్ ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండొచ్చు. అయితే లీక్‌లను పరిశీలిస్తే.. ప్రీమియం ఫోన్లతో పోలిస్తే లైటింగ్ జోన్‌ కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ నథింగ్ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

Read Also : BSNL Cheapest Plan : BSNL చీపెస్ట్ ప్లాన్.. జస్ట్ రూ. 1కే అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, ఫ్రీ సిమ్ కార్డు కూడా..!

నథింగ్ ఫోన్ 3a లైట్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
గీక్‌బెంచ్‌లోని బెంచ్‌మార్క్ లిస్టింగ్‌ల ప్రకారం.. నథింగ్ ఫోన్ 3a లైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో రావచ్చు. ఈ నథింగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో రానుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. డ్యూయల్ 50MP సెటప్, ప్రైమరీ, సింగిల్ టెలిఫోటో లెన్స్‌ సూచిస్తున్నాయి. గీక్‌బెంచ్‌లో ఈ నథింగ్ ఫోన్ సింగిల్-కోర్‌లో 1,003 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టుల్లో 2,925 పాయింట్లు సాధించింది.

భారత్‌లో నథింగ్ ఫోన్ 3a లైట్ ధర, లాంచ్ తేదీ (అంచనా) :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో, నథింగ్ ఫోన్ 3a మోడల్ లొకేషన్ దృష్ట్యా నథింగ్ ఫోన్ 3a లైట్ భారత మార్కెట్లో దాదాపు రూ.20వేలు ధర ఉంటుందని అంచనా. డీలాబ్స్ రిపోర్టు ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ ప్రారంభంలో యూరప్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అంటే.. నవంబర్ 7 నుంచి నవంబర్ 14 మధ్య భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.