BSNL Cheapest Plan : BSNL చీపెస్ట్ ప్లాన్.. జస్ట్ రూ. 1కే అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, ఫ్రీ సిమ్ కార్డు కూడా..!
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్లాన్ అదిరింది. కేవలం రూ. 1కే అద్భుతమైన డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ ఎలా పొందాలంటే?
BSNL Cheapest Plan
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా కింద వినియోగదారులు మొదటి నెల కేవలం రూ. 1కే బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసును పొందవచ్చు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 వరకు ఈ పండుగ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ 2GB డేటా, ఫ్రీ సిమ్ కార్డ్ ఉన్నాయి.
దేశంలోనే అత్యంత సరసమైన మొబైల్ ప్లాన్‌లలో (BSNL Cheapest Plan) ఇదొకటిగా చెప్పొచ్చు. అంతకుముందు, బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో ఇలాంటి లిమిటెడ్ టైమ్ “ఫ్రీడమ్ ఆఫర్” ప్రవేశపెట్టింది. ఈ లిమిటెడ్ టైమ్ ఫెస్టివల్ డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
దీపావళి బొనాంజా 2025 కింద కొత్త బీఎస్ఎన్ఎల్ యూజర్లు కేవలం ఒక రూపాయికే 4G సర్వీసులను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా , ఫ్రీ సిమ్ కార్డ్, కేవైసీ వెరిఫికేషన్ తర్వాత అందుబాటులో ఉంటాయి.
ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు లాంగ్ టైమ్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు బీఎస్ఎన్ఎల్ అప్‌గ్రేడ్ చేసిన 4G స్పీడ్ పొందవచ్చు. ట్రయల్ తర్వాత వినియోగదారులు 4జీ సర్వీసుతో పాటు BSNL స్టాండర్డ్ ప్లాన్‌లకు మారవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 1 ఆఫర్ ఎలా పొందాలి? :
బీఎస్ఎన్ఎల్ ఒక రూపాయికే దీపావళి బొనాంజాను అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా ఏదైనా అధీకృత రిటైలర్‌ను విజిట్ చేయొచ్చు. కేవైసీ పూర్తి చేసిన తర్వాత వినియోగదారులు దీపావళి బొనాంజా సిమ్‌ను అభ్యర్థించవచ్చు. తక్షణమే 4G కనెక్టివిటీని పొందవచ్చు.
ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 మధ్య ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ ప్లాన్ బెనిఫిట్స్ కోసం తమ సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ హెల్ప్‌లైన్ (1800-180-1503)ని సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ (bsnl.co.in)ని విజిట్ చేయొచ్చు.
పండుగ ఆఫర్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం సమ్మాన్ ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,812 ఉంటుంది. పూర్తి ఏడాదికి అన్‌లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, ఎక్స్‌టెండెడ్ వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. సమ్మాన్ ప్లాన్ నవంబర్ 18, 2025 వరకు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్, సెల్ఫ్‌కేర్ యాప్, అధీకృత రిటైలర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
