Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? హింట్ ఇచ్చేసిందిగా!
ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తోంది. ఈ-స్కూటర్ల లాంచ్ కు ముందే ప్రీ బుకింగ్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేయబోతోంది.

Ola Electric Scooter Top Speed May Be Over 100 Km H
Ola electric scooter top speed : ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తోంది. ఈ-స్కూటర్ల లాంచ్ కు ముందే ప్రీ బుకింగ్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో అత‍్యధిక స్పీడ్‌తో మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించి కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ మరో హింట్ ఇచ్చేశారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి హింట్స్ ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తున్నారు. ఓలా స్కూటర్ స్పీడ్ ఎంత ఉండాలని అనుకుంటున్నారో మీరే చెప్పండి అంటూ ఓ ట్వీట్ చేశారాయన.
అందులో స్పీడ్ ఆప్షన్లుగా 80kmps, 90kmph, >100kmph ఇచ్చారు. ఈ ఆప్షన్లతో అగర్వాల్ ఒక పోల్ నిర్వహించారు. ఈ లిస్టును పరిశీలిస్తే.. టాప్ స్పీడ్ వంద వరకు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ పోల్ కు చాలామంది ఫాలోవర్లు వందకు పైగా స్పీడ్ కావాలంటూ ఆన్సర్ చేశారు. ఇదివరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎన్ని రంగుల్లో రాబోతుందో పోల్ నిర్వహించారు. నెటిజన్లు 9 రంగుల్లో రావాలని ఆన్సర్ చేశారు. అప్పుడు ఆయన 10 రంగుల ఆప్షన్లలో ఓలా స్కూటర్‌ని మార్కెట్‌లోకి తేబోతున్నట్టు ప్రకటించారు.
What top speed would you want for the Ola Scooter?
— Bhavish Aggarwal (@bhash) July 24, 2021
ఓలా స్కూటర్ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లకు పైనే ఉంటుందని అంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు Lithium-ion battery తో రానున్నాయి. అప్పుడు ఓలా స్కూటర్ స్పీడ్ రేంజ్ 150కిలోమీటర్ల స్పీడ్ వరకు ఆఫర్ చేసే అవకాశం ఉందనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాంచ్ అయ్యేవరకు పూర్తి అప్ డ్స్ కంపెనీ రివీల్ చేయడం లేదు. ఓలా టాప్ స్పీడ్ పై మరింత క్లారిటీ రావాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే..