Ola S1 : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లోపం.. అదే ఆటో రివర్స్ మోడ్‌లో వెళ్తోంది.. భయంతో అమ్మేశాడు..!

Ola S1 Scooter : దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. వచ్చిన కొద్దిరోజుల్లో ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Ola S1 Scooter : దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. వచ్చిన కొద్దిరోజుల్లో ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ కూడా చేసేసింది ఓలా.. అయితే ఇప్పుడు ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే.. ముందుకు వెళ్లాల్సిన స్కూటర్ కాస్తా వెనక్కి వెళ్తోంది. ఇంకేముంది.. కస్టమర్లలో భయం పెరిగిపోయింది. ఇలా వెళ్తే ప్రమాదం కాదా? అంటూ స్కూటర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటివరకూ ఆహా.. ఓహా అన్న కస్టమర్లంతా ఇప్పుడు వామ్మో మాకొద్దు అంటూ అమ్మేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో రోజురోజుకీ చాలా లోపాలు బయట పడుతున్నాయి. ఇప్పుడు Ola S1 యూజర్ తన ఎదురైన సమస్యను ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ సమస్య కారణంగా తాను ఆ స్కూటర్‌ అమ్మేశాడట.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్‌‌లో వెళ్తొందట.. అది సాఫ్ట్‌వేర్ లోపమే అంటున్నారు. థెమ్యాంగోఫెలో అనే యూజర్ ఓలా స్కూటర్‌తో తనకు ఎదురైన సమస్యలను ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఆ స్కూటర్ కనీసం వార్నింగ్ సిగ్నల్ లేకుండా రివర్స్ మోడ్‌కి ఎలా వెళ్లిందో వివరించాడు.

దీని కారణంగా తనకు గాయాలు కూడా అయ్యాయని యూజర్ వాపోయాడు. రోడ్డు మధ్యలో కారు అడ్డంగా ఉన్న సమయంలో ఓలా స్కూటర్‌ను నేను వెనక్కి లాగాను. అంతే.. రివర్స్ మోడ్ యాక్టివేట్ అయింది.. యాక్సెల్ రేట్ రేజ్ చేయగానే ముందుకు వెళ్లాల్సిన స్కూటర్ కాస్తా.. రివర్స్ మోడ్‌లో వెళ్లిపోయింది. వెంటనే తాను కిందపడినట్టు చెప్పుకొచ్చాడు. శరీరంపై కూడా గాయాలయ్యాయని తెలిపాడు. స్కూటర్‌పై గీతలు పడ్డాయని, అదృష్టవశాత్తూ వాహనాలు పెద్దగా లేవని, దాంతో ప్రమాదం తప్పిందని ప్రాణాలతో తప్పించుకున్నానంటూ తనకు జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.

ఓలా రోడ్‌సైడ్ అసిస్టెంట్ సర్వీస్ విషయంలోనూ తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు. స్కూటర్లో సమస్యను రెండు గంటల్లో ఫిక్స్ చేస్తామని చెప్పి రెండు రోజులైన స్కూటర్ ఇవ్వలేదని వాపోయాడు. ఆలస్యంగా స్కూటర్ ఇచ్చారని, భయంతో నడపలేదని తెలిపాడు. చివరికి ఆ స్కూటర్ తన స్నేహితుడికి అమ్మేసినట్టు తెలిపాడు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి రివర్స్ మోడ్ గరిష్ట వేగాన్ని చెక్ చేయగా.. 102 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. సాఫ్ట్ వేర్ లోపం కారణంగానే ఇలా రివర్స్ మోడ్ లో హైస్పీడ్ రికార్డు అవుతుందని చెబుతున్నారు.

Read Also : Electric Two Wheeler: పేలుతున్న విద్యుత్ స్కూటర్లు: ఎండాకాలం వాహనదారులు జాగ్రత్త

ట్రెండింగ్ వార్తలు