OnePlus 11R 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

OnePlus 11R 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మిడ్ రేంజ్ ప్రీమియం 5జీ ఫోన్ మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే..

OnePlus 11R 5G Price : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఫోన్ వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మిడ్-రేంజ్ ప్రీమియం 5జీ ఫోన్ గత ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం దేశంలో వన్‌ప్లస్ తగ్గింపు ధరతో హ్యాండ్‌సెట్‌ను అందిస్తోంది.

Read Also : Nothing Phone 2a : రెడ్‌మి, పోకో ఫోన్లకు పోటీగా నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

కస్టమర్లు ధరను మరింత తగ్గించడానికి బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీని కలిగి ఉంది. 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

భారత్‌లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర రూ. 3వేలు తగ్గింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ సింగిల్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 37,999కు పొందవచ్చు. అసలు లాంచ్ ధర రూ. 39,999 ఉండగా.. మూడు వేలు తగ్గింది. 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ. 44,999 ఉండగా రూ.41,999కి తగ్గింది.

ఈ కొత్త ధర అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ రెండింటిలోనూ పొందవచ్చు. ఈ ఫోన్ గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్, సోలార్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అదేవిధంగా, వన్‌ప్లస్ ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు. నెలకు రూ. 4,334 ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. అమెజాన్‌లో అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 2,500 విలువైన వెల్‌కమ్ రివార్డులను పొందవచ్చు.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ అడాప్టివ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (1,240×2,772 పిక్సెల్‌లు) కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరాతో కూడిన హోల్ పంచ్ కటౌట్ ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. దానితో పాటు 16జీబీ వరకు ఆన్‌బోర్డ్ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. 16ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ ఫోన్ 100డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ట్రెండింగ్ వార్తలు