OnePlus 12: వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు..

వన్‌ప్లస్ 12 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తిమంతమైన ప్రాసెసర్, ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం రూ.13,600 ఫ్లాట్ డిస్కౌంట్‌ ఉంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.51,500కే కొనుక్కోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12.. 2024లో లాంచ్‌ అయింది. రూ.50,000 ధరకు అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్‌ఫోన్లలో ఇది ఒకటి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ “సాసా లెలె” సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి. ఇందులో భాగంగా వన్‌ప్లస్ 12పై రూ.13,604 డిస్కౌంట్ ఉంది.

వన్‌ప్లస్ 12 అసలు ధర రూ.64,999 అని, డిస్కౌంట్‌తో రూ.51,395కే ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నెలకు కేవలం రూ.1,807 నుండి ప్రారంభమయ్యే ఏఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్‌ మోడల్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24పై వేలాది రూపాయల తగ్గింపు.. ఇంత మంచి ఆఫర్‌ను ఎవరైనా వదులుకుంటారా?

వన్‌ప్లస్ 12 ఫీచర్లు
వన్‌ప్లస్ 12.. 6.82-అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16GB RAM, 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆక్సిజెనోస్‌పై ద్వారా రన్ అవుతుంది. ఆప్టిక్స్ పరంగా హ్యాండ్‌సెట్ OISతో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 64MP పెరిస్కోప్ టెలిఫొటో, 48MP అల్ట్రావైడ్ సెన్సార్‌ ఇందులో ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ 12.. 5,400 mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. 100W సూపర్‌వూక్ వైర్డు ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఉంది.