రూ.19,001 డిస్కౌంట్.. ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే కొనేయండి..
ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది

అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 5జీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. భారీ ధర ఉండే స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో వస్తే కొనుక్కుందామని వేచి చూస్తున్న వారు దీన్ని కొనుగోలు చేయొచ్చు.
బ్యాంక్ ఆఫర్లను కూడా వాడుకుంటే రూ.19,001కు పైగా డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ 12 5జీని మార్కెట్లోకి రూ.64,999 ధరకు లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా, పనితీరు, డిజైన్ యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి.
అమెజాన్‌లో వన్‌ప్లస్ 12ను రూ.51,998 ధరకు లిస్ట్ చేశారు. దానిపై రూ.13,001 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాదు.. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డును ఉపయోగించి అదనంగా రూ.6,000 తగ్గించుకోవచ్చు. మీ పాత ఫోన్‌ను దాని పనితీరును బట్టి రూ.22,800కు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
Also Read: ట్రంప్ దెబ్బకు రొయ్యల రేట్లు రప్పా రప్పా.. గోదావరి జిల్లాలో కేజీ ఎంత పడిపోయిందంటే..
ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ .2,521 చెల్లిస్తూ ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 12.. 6.82-అంగుళాల QHD+ 2K OLED డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేటుతో 4,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది.
ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP OV64B పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP IMX581 అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.