Amazon Great Indian Festival Sale
Amazon Great Indian Festival Sale 2025 : అమెజాన్ సేల్ మొదలైంది.. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా పలు స్మార్ట్‌ఫోన్లపై క్రేజీ డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో ముఖ్యంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 నుంచి మిడ్ రేంజ్ వన్‌ప్లస్ 13R వరకు అదిరిపోయే ఆఫర్లను పొందవచ్చు. ఇప్పుడు, వన్‌ప్లస్ ఫోన్‌లపై డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13, 13R, నార్డ్ 5, నార్డ్ సీఈ 5 ధర తగ్గింపు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా వన్‌ప్లస్ 13 ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB RAM వేరియంట్ అసలు ధర రూ.69,999 నుంచి రూ.61,999కి తగ్గింపు పొందింది. ఆసక్తిగల వినియోగదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.1,250 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఆక్సిజన్ OS 15 యూఐపై రన్ అవుతుంది. 50MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50MP టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
అమెజాన్ ఇండియాలో వన్‌ప్లస్13R ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అసలు ధర రూ.42,999 నుంచి రూ.37,999కు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 మాదిరిగానే డిస్కౌంట్ కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
6000mAh బ్యాటరీ కూడా ఉంది. రెండు 50MP సెన్సార్‌లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.26,999 నుంచి అమెజాన్‌లో కేవలం రూ.23,499 ధరకే లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ కూడా ఇప్పటికీ ప్లాట్‌ఫామ్‌లో రూ.30,499కు లభ్యమవుతోంది.
ఏ ఫోన్ కొనాలంటే? :
మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. వన్‌ప్లస్ 13 కన్నా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. హెవీ-డ్యూటీ ప్రాసెసర్, హై లెవల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. అంతే కాకుండా, మీ అవసరాలన్నింటికి సరిపోయే ఫోన్ కోసం చూస్తుంటే వన్‌ప్లస్ 13Rని కొనేసుకోవచ్చు. భారీ గేమ్‌ల కోసం కాకుండా కేవలం బడ్జెట్ ఫోన్ మాత్రమే కోరుకునే యూజర్లు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 బెస్ట్ ఫోన్ కొనేసుకోవచ్చు.