కేక పెట్టించే ఫీచర్లు ఉన్న OnePlus 13ను కొనేందుకు ఇదే మంచి ఛాన్స్‌.. భారీ ఆఫర్

పర్ఫార్మన్స్‌ చాలా బాగుండడం, అధునాతన కెమెరాలు, మంచి డిజైన్‌ ఉండడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి చూపుతున్నారు.

కేక పెట్టించే ఫీచర్లు ఉన్న OnePlus 13ను కొనేందుకు ఇదే మంచి ఛాన్స్‌.. భారీ ఆఫర్

Updated On : May 4, 2025 / 4:57 PM IST

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.72,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న డిస్కౌంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.64,800కే కొనుగోలు చేయవచ్చు. అంతేగాక అదనంగా బ్యాంక్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు బిల్లు చెల్లిస్తే మీకు రూ.3,240 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే మీరు రూ.2,500 తగ్గింపు అందుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13ని ఈ ఏడాది జనవరిలో భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేశారు. పర్ఫార్మన్స్‌ చాలా బాగుండడం, అధునాతన కెమెరాలు, మంచి డిజైన్‌ ఉండడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 డిస్ప్లే, డిజైన్
స్క్రీన్: QHD+ రిజల్యూషన్ (3168 × 1440), 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్, 6.82-అంగుళాల LTPO AMOLED.
ప్రొటెక్షన్: సిరామిక్ గార్డ్ కవర్ గ్లాస్‌తో
డిజైన్: IP68/IP69, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో మైక్రోఫైబర్ వీగన్ లెదర్
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్
మెమరీ: 12GB, 16GB, లేదా 24GB LPDDR5X RAM
స్టోరేజ్: 256GB, 512GB, లేదా 1TB UFS 4.0 స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆక్సిజన్ OS 15 తో Android 15
బ్యాక్ కెమెరాలు: f/1.6 ఎపర్చర్‌తో 50MP ప్రధాన సెన్సార్ (సోనీ LYT-808), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్
ఫ్రంట్ కెమెరా: f/2.45 ఎపర్చర్‌తో 32MP సెల్ఫీ కెమెరా