×
Ad

సమయం ఆసన్నమైంది.. వన్ ప్లస్ నుంచి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోందోచ్‌.. ఫీచర్లు చూస్తే వదలరు..

ఫ్లాష్ బ్లాక్, షాడో గ్రీన్, ఎలక్ట్రిక్ పర్పుల్ కలర్స్‌ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.

OnePlus Ace 6T

వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6Tని ఈ నెల చివరలో చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పర్ఫార్మన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ, క్వాల్‌కామ్ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో, గేమింగ్ లవర్స్‌కు సరికొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

స్నాప్‌డ్రాగన్ కొత్త తరం చిప్‌తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్
OnePlus Ace 6Tలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ ఉంటుందని వన్‌ప్లస్ స్పష్టం చేసింది. ఈ చిప్‌సెట్‌ను మొట్టమొదటగా Ace 6T మోడల్‌తోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి క్వాల్‌కామ్‌తో కలిసి ప్రత్యేక ట్యూనింగ్ చేసినట్లు కూడా వన్‌ప్లస్ తెలిపింది. ముఖ్యంగా, 165 ఫ్రేమ్‌ల స్థిరమైన గేమ్‌ప్లేకు సపోర్టు ఇవ్వడం దీని ప్రధాన ఆకర్షణ. ఇందుకోసం కొత్త గేమింగ్ కోర్‌ను ఉపయోగించారు.

చైనా వన్‌ప్లస్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. Ace 6T కేవలం అధిక ఫ్రేమ్ రేట్లను అందించడమే కాకుండా, అవి నిరంతరం సున్నితంగా కొనసాగేలా చూస్తుంది.

ఆకర్షణీయమైన డిజైన్
ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన లీక్‌ల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. నివేదికల ప్రకారం, Ace 6Tలో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు. 8,000mAh బ్యాటరీతో 100W ఛార్జింగ్ కూడా ఉంటుందని సూచిస్తున్నారు.

కెమెరా విషయానికి వస్తే, బ్యాక్‌సైడ్ 50MP ప్రధాన సెన్సర్‌తో పాటు 8MPతో రెండో కెమెరా ఉండవచ్చు. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా వచ్చే అవకాశం ఉంది. ఇతర లీక్‌లలో మెటల్ మిడ్-ఫ్రేమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ రీడర్, లీనియర్ మోటార్, డ్యూయల్ స్పీకర్లు, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌ వంటివి ఉన్నాయి.

ఫ్లాష్ బ్లాక్, షాడో గ్రీన్, ఎలక్ట్రిక్ పర్పుల్ కలర్స్‌ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. అదనంగా, జెన్షిన్ ఇంపాక్ట్ స్ఫూర్తితో ప్రత్యేక ఎడిషన్ కూడా ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.