OnePlus announces Diwali offers, OnePlus Nord 3 and Nord CE 3 available at special prices
OnePlus Diwali Offers : పండుగ సీజన్ వచ్చేసింది. వన్‌ప్లస్ అభిమానులందరికీ ఒక ట్రీట్‌ను అందించింది. బ్రాండ్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలతో సహా అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వన్‌ప్లస్ సేల్ నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 10 వరకు కొనసాగుతుంది. మీరు కొత్త వన్‌ప్లస్ ప్రొడక్టును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ఇదే సరైన సమయం. డిస్కౌంట్‌లో లభించే ఫోన్‌లలో వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలోని ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
వన్‌ప్లస్ ఈ ఏడాదిలో వివిధ నార్డ్ సిరీస్ ఫోన్‌లను అందించింది. వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆకర్షణీయమైన ధరలో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తాయి. ఇప్పుడు ఈ ధరలు మరింత తగ్గింపుకు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ పండుగ ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ రూ. 3వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు రూ.3వేల ప్రత్యేక ధర కూపన్ తగ్గింపు కూడా అందిస్తుంది. వినియోగదారులు 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో ఈ ఫోన్ పొందవచ్చు.
Read Also : OnePlus Watch 2 Launch : కొత్త వన్‌ప్లస్ వాచ్ 2 వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల బ్యాటరీ లైఫ్..!
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ రూ. 2వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. రూ. 2,500 ప్రత్యేక ధర కూపన్ తగ్గింపు కూడా అందిస్తుంది. ఇంతలో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ రూ. 1,500 బ్యాంక్ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌లు 3 నెలల వరకు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ ధరపై నో కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. అమెజాన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, (OnePlus.in)లో ICICI బ్యాంక్, OneCard కస్టమర్‌లు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు.
OnePlus Diwali offers, OnePlus Nord 3 and Nord CE 3
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5G ఫోన్ సోలార్ రెడ్ స్పెషల్ ఎడిషన్ కూడా రూ. 2వేల తగ్గింపుతో లభిస్తాయి. కస్టమర్‌లు ఈ డివైజ్‌లను కొనుగోలు చేసిన తర్వాత 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. దీనితో పాటు, వన్‌ప్లస్ 10ఆర్ 5జీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ. 3వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ. 7వేల ప్రత్యేక ధర కూపన్‌ను పొందవచ్చు. అలాగే, వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్, వన్‌ప్లస్ 10టీ 5జీపై ఆసక్తి ఉన్నవారు రూ. 5వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌లు, రూ. 14వేలు, రూ.10వేల విలువైన స్పెషల్ ప్రైస్ కూపన్‌లను కూడా పొందవచ్చు.
Read Also : Moto G Power 5G 2024 : మోటో G పవర్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?