OnePlus Pad Go Sale : ఈ నెల 20న వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?

OnePlus Pad Go Sale : వన్‌ప్లస్ ప్యాడ్ గో ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ టాబ్లెట్ అక్టోబర్ 20న అమ్మకానికి రెడీగా ఉంది. బడ్జెట్ వన్‌ప్లస్ టాబ్లెట్ ధర రూ. 19,999తో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్లతో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

OnePlus Pad Go Sale : ఈ నెల 20న వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?

OnePlus Pad Go first sale in India on October 20

OnePlus Pad Go Sale : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ నుంచి (OnePlus Pad Go) ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త టాబ్లెట్ ఇప్పుడు అక్టోబర్ 20న అమ్మకానికి రెడీగా ఉంది. బడ్జెట్ వన్‌ప్లస్ టాబ్లెట్ రూ. 19,999 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్లతో లేటెస్ట్ వన్‌ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ సేల్ ఆఫర్లు, భారత్ ధర, స్పెషిఫికేషన్లను ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ ప్యాడ్ గో భారత్ ధర ఎంతంటే? :

వన్‌ప్లస్ ప్యాడ్ గో మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ WIFI మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 19,999కు సొంతం చేసుకోవచ్చు. అదే మోడల్ LTE వెర్షన్ రూ. 21,999కి విక్రయిస్తోంది. అయితే 256GB LTE మోడల్ ధర రూ. 23,999కు పొందవచ్చు. ఈ టాబ్లెట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ స్టోర్‌లు, రిలయన్స్, క్రోమా, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Instagram Custom Stickers : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫోన్‌లో ఫొటోలతో కస్టమ్ స్టిక్కర్లు క్రియట్ చేసి షేర్ చేయొచ్చు!

వన్‌ప్లస్ ప్యాడ్ గో సేల్ ఆఫర్లు :
ICICI బ్యాంక్, OneCard కార్డ్‌లపై రూ. 2వేల డిస్కౌంట్ ఆఫర్ ఉంది. మీరు వన్‌ప్లస్ గో టాబ్లెట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, (OnePlus.in), కొన్ని ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేస్తే ధరను రూ.17,999కి తగ్గిస్తుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేస్తే అదనంగా రూ. 1,000 ప్రత్యేక ధర కూపన్ తగ్గింపును కూడా పొందవచ్చు.

ఈ ఆఫర్ 8GB RAM + 128GB Wi-Fi వేరియంట్‌పై అందిస్తుంది. అమెజాన్ ద్వారా వన్‌ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ కొనుగోలు చేసే కస్టమర్‌లు SBI కార్డ్‌లను ఉపయోగించి రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంకులో కూడా ఇలాంటి ఆఫర్ అందుబాటులో ఉంది.

OnePlus Pad Go first sale in India on October 20

OnePlus Pad Go Sale

వన్‌ప్లస్ ప్యాడ్ గో స్పెసిఫికేషన్లు, డిజైన్, ఫీచర్లు :

వన్‌ప్లస్ ప్యాడ్ గో మోడల్ రెండు-టోన్ డిజైన్‌తో మెటాలిక్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. టాబ్లెట్‌లో మొత్తం 2 కెమెరాలు ఉన్నాయి. అందులో ముందు, వెనుక ఒకటి. ఈ డివైజ్ ప్రీమియం వెర్షన్ మాదిరిగానే స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంది. ట్విన్ మింట్ కలర్‌వే అనే ఒకే కలర్ ఆప్షన్లలో వస్తుంది.

కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ గో మోడల్ 11.35-అంగుళాల స్క్రీన్‌తో 2.4k రిజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే గరిష్ట బ్రైట్ 400 నిట్‌లు కలిగి ఉంది. హుడ్ కింద MediaTek Helio G99 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ గో మోడల్ 33W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్టుతో 8,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుంది.

Read Also : Lava Blaze Pro Price : రూ. 15వేల లోపు ధరకే బెస్ట్ లావా బ్లేజ్ ప్రో 5G ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?