OnePlus Foldable Smartphone : వన్+ నుంచి మడతబెట్టే ఫోన్.. ఒకటి కాదు.. మూడు స్ర్కీన్లు అంట!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతోంది. ఎప్పుటికప్పుడూ క్రేజ్ పెంచుకుంటూ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Oneplus Patent Hints At A Foldable Smartphone With Three Screens (1)
OnePlus Foldable Phone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతోంది. ఎప్పుటికప్పుడూ క్రేజ్ పెంచుకుంటూ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రొడక్టులను మార్కెట్లోకి వదిలిన వన్ ప్లస్?. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. అది మాములు స్మార్ట్ ఫోన్ కాదండోయ్.. మడతబెట్టే ఫోన్.. (Foldable Smartphone). ఈ ఫోల్డబుల్ ఫోన్.. ఒక స్ర్కీన్ కాదు.. ఏకంగా మూడు స్ర్కీన్లు ఉండనున్నాయి. లెట్స్‌గోడిజిటల్ ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతోంది.
స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ మూడు మడతల్లో రానుంది. చైనాలో పేటెంట్ డాక్యుమెంట్‌లను bbk electronics కంపెనీ ఏడాదిలోనే తీసుకొచ్చింది. 2021 జూలై నెలలో ఆ డాక్యుమెంట్ పబ్లిష్ అయ్యిందని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ డేటాబేస్ వెల్లడించింది. వన్‌ఫ్లస్ తీసుకొస్తున్న ఫోల్డబుల్ ఫోన్ వేర్వేరు యాంగిల్స్ (ట్రయాంగిల్.. రోటేటింగ్ టర్నింగ్ ప్లేట్) మడతపెట్టుకునేదిలా ఉండనుంది. యూజర్ అప్లికేషన్‌లు ఎక్కువగా ఉన్నాయట.
స్లైడింగ్ కీ ప్యాడ్‌తో రానుంది. డబుల్ హింగ్‌డ్ టెక్నాలజీతో వస్తోంది. వాస్తవానికి వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్ వస్తుందనే టాక్ నడుస్తోంది. మరోవైపు శాంసంగ్ కూడా గెలాక్సీ G ఫోల్డ్ సిరీస్ తీసుకొస్తోంది. శాంసంగ్‌కు పోటీగా వన్ ప్లస్ మూడు స్ర్కీన్ల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తుందని వార్తలు వినిపించాయి. వన్‌ఫ్లస్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని వన్‌ఫ్లస్ ప్రయత్నాలు చేస్తోంది.
Read Also : Covid Vaccine For Kids : చిన్నారులకు ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్..ఈయూ ఆమోదం