Oppo Find N Press Renders Tipping Design, Specifications Surface Ahead Of December 15 Launch (1)
Oppo Find N : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. డిసెంబర్ 15న ఒప్పో మడతబెట్టే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్స్ చాలానే వచ్చాయి. ఒప్పో నుంచి ఫస్ట్ టైం మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ వస్తోంది. Oppo Find N పేరుతో ఈ కొత్త మోడల్ ప్రవేశపెట్టనుంది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 మోడల్‌కు పోటీగా Oppo Find N పోటీ ఇవ్వనుంది. INNO Day 2021 ఈవెంట్ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. డిసెంబర్ 15న ఒప్పో ఫైండ్ ఎన్ మోడల్‌ను ఒప్పో ఆవిష్కరించనుంది.
Most pop-ups are annoying…
But not our self-developed retractable camera! ?
Explore more in INNO WORLD on 14/12.#OPPOINNODAY2021 pic.twitter.com/33hgJSw8If
— OPPO (@oppo) December 7, 2021
దీనికి సంబంధించిన వీడియోను ఒప్పో అధికారిక అకౌంట్లో ట్వీట్ చేసింది. ఒప్పో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. Oppo Find N మోడల్ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో రానుందని కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 8 Zen 1 చిప్‌సెట్ లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వర్టికల్ లేఅవుట్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ అమర్చినట్టు తెలుస్తోంది. ఇక డిజైన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మాదిరిగానే ఉంటుంది. రియర్ కెమెరాలో ఫొటో క్లిక్ కెమెరా వెలుపలికి వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం 4ఏళ్లుగా కృషి చేస్తున్నామని ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వన్‌ప్లస్ వ్యవస్థాపకులు ప్రకటించారు. మొత్తం 6 జనరేషన్స్ రూపొందించినట్టు తెలిపారు.
This is the exquisitely engineered #OPPOFindN.
Hold. Fold. Enjoy. Repeat.
Coming December 15. #OPPOINNODAY2021 pic.twitter.com/LVZKNgYiAv— OPPO (@oppo) December 9, 2021
మొదటి జనరేషన్ Oppo Find N 2018లోనే రూపొందించింది. కానీ, కమర్షియల్ మార్కెట్లోకి ఒప్పో విడుదల చేయలేదు. ఎట్టకేలకు ఈ మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తమ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి అనేది క్లారిటీ లేదు. ఈ నెల 15న INNO Day 2021 ఈవెంట్‌లో మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను అధికారికంగా వెల్లడించనుంది. లాంచ్ కు ముందే ఆన్‌లైన్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. Oppo Find N స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ వెల్లడించింది. లీకైన ఫీచర్ల ప్రకారం.. 50MP కెమెరా, హోల్ పంచ్ డిస్‌ప్లే ఉండొచ్చు.. స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ల ఆప్షన్లలో వస్తోంది.
Read Also : WhatsApp Accounts : వాట్సాప్‌లో మీ నెంబర్ బ్యాన్ అయ్యిందా..మీరు తెలుసుకోవాల్సిన విషయాలు