Oppo Reno 11 Series to debut in India on January 12
Oppo Reno 11 Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో రెనో 11, రెనో 11 ప్రోతో కూడిన రెనో 11 సిరీస్ జనవరి 12న భారత మార్కెట్లో లాంచ్ కానుందని ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది. అయితే, లాంచ్‌కు ముందు కొన్ని స్పెసిఫికేషన్‌లు, వెనిలా రెనో 11 ధర ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
ఒప్పో రెనో 11 అంచనాలు :
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ ప్రకారం.. ఒప్పో రెనో 11 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత కలర్ ఓఎస్ స్కిన్‌పై రన్ అవుతుంది.
ఆప్టిక్స్ పరంగా.. ఒప్పో రెనో 11 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 32ఎంపీ ఐఎమ్ఎక్స్709 టెలిఫోటో లెన్స్, 8ఎంపీ ఐఎమ్ఎక్స్355 సెన్సార్‌కు సపోర్టుతో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ600 ప్రైమరీ సెన్సార్‌తో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అన్ని సెల్ఫీలు, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32ఎంపీ సెన్సార్ ఉంటుంది.
Oppo Reno 11 Series on January 12
ఒప్పో రెనో 11 బాక్స్‌లో చేర్చిన 67డబ్ల్యూ ఛార్జర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వేవ్ గ్రీన్, రాక్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఇటీవలి లీక్‌లో ఒప్పో రెనో 11 ప్రో డైమెన్సిటీ 8200 లేదా స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందవచ్చు. అంతేకాదు.. 80డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది.
భారత్‌లో ఒప్పో రెనో 11 ధర (అంచనా) :
ఒప్పో రెనో 11 భారత్ వేరియంట్ ధర సుమారు రూ. 28వేలుగా ఉంటుందని అంచనా. వివో వి29ఇ, శాంసంగ్ గెలాక్సీ ఎ34తో సహా సెగ్మెంట్‌లోని ఇతర ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. హై-ఎండ్ ఒప్పో రెనో 11 ప్రో భారత్‌లో దాదాపు రూ. 35వేల ధరలో ఉండవచ్చు.
Read Also : Apple Days Sale : ఆపిల్ డేస్ సేల్ పొడిగింపు.. ఐఫోన్ 15, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2పై భారీ తగ్గింపులు..