Oppo Reno 12 Series : కొత్త ఒప్పో రెనో 12 సిరీస్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oppo Reno 12 Series : ఒప్పో నుంచి సరికొత్త రెనో మోడల్ 5జీ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 12 సిరీస్ పేరుతో ఈ నెల 12న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Oppo Reno 12 Series : కొత్త ఒప్పో రెనో 12 సిరీస్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oppo Reno 12 series confirmed launch ( Image Source : Google )

Oppo Reno 12 Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త రెనో మోడల్ 5జీ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 12 సిరీస్ పేరుతో ఈ నెల 12న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. కొన్ని వారాల క్రితమే గ్లోబల్ మార్కెట్‌లో ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ రెనో 12 సిరీస్‌ను రిలీజ్ చేసింది.

Read Also : Oppo A3 Pro Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో A3 ప్రో ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతో తెలుసా?

ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 5జీ, రెనో 12ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఒప్పో గత వారమే స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌కు వస్తున్నట్లు ధృవీకరించింది. రెనో 12 సిరీస్ జూలై 12న లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. ఒప్పో రెనో 12 సిరీస్‌లో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి కొన్ని హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి.

ఒప్పో రెనో 12 సిరీస్ ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్టూడియో, ఏఐ టూల్, ఏఐ క్లియర్ ఫేస్‌తో సహా ఇంటర్నల్ ఏఐ ఫీచర్లతో వస్తుందని ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది. రెనో 12 సిరీస్‌లో ఏఐ మధ్యలో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఒప్పో రెనో 12, రెనో 12 ప్రో బీకాన్‌లింక్ టెక్నాలజీతో ఆసక్తికరమైన ఫీచర్ అందిస్తుంది.

ఈ టెక్నాలజీతో బ్లూటూత్ ద్వారా వన్-టు-వన్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నెట్‌వర్క్ లేని వాతావరణంలో వాకీ-టాకీ మాదిరిగా పనిచేస్తుంది. రెనో 12 సిరీస్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 80డబ్ల్యూ సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్టు అందిస్తుందని ఒప్పో ధృవీకరించింది. కంపెనీ ప్రకారం.. బ్యాటరీని కేవలం 46 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో బ్యాటరీ లైఫ్ ప్రొటెక్ట్ చేస్తాయి.

ఒప్పో రెనో 12, రెనో 12ప్రో ఫీచర్లు :
ఒప్పో భారత్‌లో రెనో 12 సిరీస్ స్పెసిఫికేషన్‌లను ఇంకా ధృవీకరించలేదు. అయితే, చిప్‌సెట్ తేడాలను మినహాయించి చైనీస్ వేరియంట్‌ల మాదిరిగానే ఉండొచ్చు. ఒప్పో రెనో 12 చైనీస్ వెర్షన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్ఓసీ, 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14.1పై రన్ అవుతుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో 12 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. పిక్సెల్ సాంద్రత 394 పీపీఐ, 1,200 నిట్స్, గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7ఐ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హెచ్‌డీఆర్10+కి సపోర్టు ఇస్తుంది.

కెమెరా సామర్థ్యాల పరంగా, రెనో 12 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ600 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో యూనిట్‌తో అమర్చి ఉంది. ఫ్రంట్ కెమెరా ఎఫ్/2.0 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో 32ఎంపీ ఉంది. ఒప్పో రెనో 12 ప్రోలో ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. అయితే, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, మెరుగుపరిచే 50ఎంపీ ఫ్రంట్ కెమెరా, రెండూ ఎఫ్/2.0 ఎపర్చర్లు, ఆటో ఫోకస్‌తో ఉంటాయి.

ఒప్పో రెనో 12, రెనో 12ప్రో సిరీస్ : భారత్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో రెనో 12 సిరీస్ అధికారిక ధర జూలై 12న లాంచ్ సమయంలో రివీల్ చేయనుంది. అయితే, చైనీస్ వేరియంట్‌ను పరిశీలిస్తే.. భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు ఏ ధర విభాగంలో వస్తాయి అనేదానిపై క్లారిటీ లేదు. ఒప్పో రెనో 12, రెనో 12ప్రో చైనీస్ మార్కెట్‌లో వరుసగా సీఎన్‌వై 2,699, సీఎన్‌వై 3,399 ధరలతో ప్రారంభమయ్యాయి. మీ సాధారణ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే భారతీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 30వేల నుంచి రూ. 40వేల మధ్య ఉంటుంది.

Read Also : Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!