ఫీచర్లు చూస్తే ఫిదానే: Reno 3 Pro.. కెమెరా ఫోన్లకే రారాజు!

కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో బెస్ట్ కెమెరా ఫోన్ ఏది ఉందా అని తెగ వెతికేస్తున్నారా? అయితే, చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి వచ్చిన లేటెస్ట్ రెనో బ్రాండ్ Reno3 pro స్మార్ట్ ఫోన్ ఓసారి లుక్కేయండి.. అద్భుతమైన కెమెరాలే దీనికి స్పెషల్ ఎట్రాక్షన్.. కెమెరా ఫోన్లకే కింగ్ అని చెప్పొచ్చు. ఫాంటిస్టిక్ AMOLED స్ర్కీన్ తో పాటు స్మూత్ రియర్ కెమెరాలతో అదిరిపోతోంది.
స్టయిలీష్ గానూ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. రెనో సిరీస్ లేటెస్ట్ రెండు జనరేషన్లలో ఒప్పో రెనో 3 ప్రోనే పవర్ పుల్ స్మార్ట్ ఫోన్.. ఇందులో నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఒక్కో సెన్సార్.. అద్భుతంగా పనిచేస్తాయి.
రెనో 3ప్రోలో ఆకర్షణీయమైన క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ లెన్స్ కెమెరాలో అల్ట్రా క్లియర్ 64MP షూటర్ తో అప్రెచర్ f/1.7, షూట్ అల్ట్రా-క్లియర్ ఫొటోల కోసం ప్రత్యేకించి డిజైన్ చేశారు. 64MP షూటర్ సూపర్ క్లారిటీతో ఫొటోలను తీసుకోవచ్చు.
అంతేకాదు.. ఈ సెన్సార్.. అల్ట్రా క్లియర్ 108MP ఫొటోలను ఎట్రాక్టివ్ గా క్యాప్చర్ చేయగలదు. ఇక రెండో లెన్స్.. 13MP టెలిఫొటో లెన్స్ అత్యద్భుతంగా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8MP కెమెరాతో 109డిగ్రీల ఫొటోలను కూడా తీసుకోవచ్చు. 2MP మోనో సెన్సార్ కూడా ఉంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. 13MP, 64MP, 8MP కెమెరాలతో మంచి జూమ్ క్యాపబులిటీలను కలిగి ఉంది. 5x హైబ్రిడ్ జూమ్ మాత్రమే కాదు.. భారీ 20X డిజిటల్ జూమ్ కెపబులిటీ కూడా ఉంది.
సెల్ఫీ షూటర్ గా ఒప్పో రెనో 3 ప్రోలో ఆకర్షణీయమైన డ్యుయల్ కెమెరా సెటప్‌తో వరల్డ్ క్లాస్ సెల్ఫీలను తీసుకోవచ్చు. ఇక ప్రైమరీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో 44MP డ్యుయల్ పంచ్ హోల్ కెమెరా ప్రపంచంలోనే ఫస్ట్ కెమెరాగా వచ్చింది. ఇందులో 2MP డెప్త్ సెన్సార్ ఇమిడి ఉంటుంది. ఈ సెల్ఫీ షూటర్ నుంచి బినోక్యూలర్ బుఖే ఎఫెక్ట్ అద్భుతంగా తీసుకోవచ్చు. అల్ట్రా నైట్ సెల్ఫీ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా క్రిస్టల్ క్లియర్, రాత్రి సమయంలో సెల్ఫీలు ఫుల్ క్లారిటీతో తీసుకోవచ్చు.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
* ColorOS7 ఆపరేటింగ్ సిస్టమ్
* 8GB+128GB వేరియంట్
* 8GB+256GB వేరియంట్
* 4025 mAh బ్యాటరీ
* 30W ఛార్జింగ్ పవర్ బ్రిక్
* బ్యాటరీ టెంపరేచర్ ప్రొటెక్షన్ బోర్డు
* స్ర్కీన్ ఇమేజ్ ఇంజిన్ (OSIE)
* ప్యూరిటీ, నేచర్, జియోమెట్రీ, కల్చర్, లైఫ్, ఫ్యూచర్
* మూడు కలర్లు మిడ్ నైట్ బ్లాక్, స్కై వైట్ అండ్ అరోరల్ బ్లూ