అమెరికాలో టిక్ టాక్ క్లౌడ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ByteDance కంపెనీతో డీల్ కుదిరిందని క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ ఫాం Oracle వెల్లడించింది. అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చివరిలో చైనా కంపెనీ బైట్ డాన్స్ నిరాకరించడంతో ఆగిపోయింది. మైక్రోసాఫ్ట్ స్థానంలో ఒరాకిల్ కొనుగోలు చేస్తోందంటూ రుమర్లు వచ్చాయి..
కానీ, వాస్తవానికి ఒరాకిల్ టిక్ టాక్ ఆపరేషన్స్ కొనుగోలు చేయలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. అందుకు బదులుగా ట్రస్టడ్ టెక్ పార్టనర్‌గా మాత్రమే బైట్ డాన్స్ తో డీల్ కుదుర్చుకుంది.. కేవలం టిక్ టాక్ యాప్ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనుంది.. కొనుగోలు చేయడం లేదు.. తన సొంత క్లౌడ్ టెక్నాలజీస్ సర్వర్లపై అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహించనుంది. మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ కొనుగోలు చేయడం లేదనే వార్త వచ్చిన గంట వ్యవధిలోనే ఒరాకిల్ డీల్ వెలుగులోకి వచ్చింది.
టిక్ టాక్ ఆపరేషన్స్ కొనాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లోనూ టిక్ టాక్ ఆపరేషన్స్ హక్కులు పొందాలని భావించింది. కానీ, బైట్ డాన్స్ నిరాకరించడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆ వాటాను కొనడానికి బదులుగా టెక్నాలజీ పార్టనర్‌గా బైట్ డాన్స్ తో ఒప్పందం చేసుకుంది ఒరాకిల్.. ఆగస్టు 6న బైట్ డాన్స్ కు సంబంధించి అన్ని లావాదేవీలు బ్లాక్ చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన సంగతి తెలిసిందే.
https://10tv.in/china-our-biggest-foreing-policy-failure-in-40-years-america/
అమెరికా కంపెనీ ఏదైనా టిక్ టాక్ ఆపరేషన్స్ కొనుగోలు చేయొచ్చునని ట్రంప్ ఆదేశించారు. 45 రోజుల్లోగా ఇదంతా పూర్తికావాలన్నారు. కానీ, బైట్ డాన్స్ కు మాత్రం ట్రంప్ 90 రోజుల సమయం ఇచ్చారు.. అమెరికాలో టిక్ టాక్ యాప్ వాటాలను అమ్ముకోవాని ఆదేశించాడు.. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది..
Microsoft statement on TikTok:https://t.co/HioNmVlDpk
— Microsoft (@Microsoft) September 13, 2020
బైట్ డాన్స్ నిరాకరణతో ఒరాకిల్ ముందుకొచ్చింది.. ఒరాకిల్ కంపెనీ.. అమెరికా ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం ఎప్పటినుంచో ఉంది.. ఆ ధీమాతోనే బైట్ డాన్స్ తో ఒప్పందానికి రెడీ అయింది.. తన సొంత క్లౌడ్ టెక్నాలజీలో అమెరికా టిక్ టాక్ ఆపరేషన్స్ నిర్వహణకు అంగీకరించింది.