WhatsApp Accounts Ban _ Over 36 lakh WhatsApp accounts banned in India in December 2022
WhatsApp Accounts Ban : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లక్షలాది భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో వాట్సాప్ (Whatsapp) తమ యూజర్లకు సంబంధించిన భద్రతా నివేదికను రివీల్ చేసింది. 2022 డిసెంబర్‌లో 36 లక్షల ఫేక్ అకౌంట్లను నిషేధించిందని పేర్కొంది. వాట్సాప్ అకౌంట్లలో IT రూల్స్, 202ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. భారతీయ వాట్సాప్ అకౌంట్లు 1,389,000 వరకు బ్యాన్ చేసినట్టు మెసేజింగ్ యాప్ వెల్లడించింది. వాట్సాప్ యూజర్ల నుంచి ఏదైనా రిపోర్టు కంపెనీకి చేరడానికి ముందు కొన్ని అకౌంట్లను తొలగిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్ యూజర్ల భద్రత గురించి ప్రతినిధి మాట్లాడుతూ.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ అగ్రగామిగా నిలిచిందన్నారు. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టులు, నిపుణులు స్థిరంగా ఏళ్ల తరబడిగా పెట్టుబడులు పెడుతోంది.
ఈ క్రమంలో దేశంలో IT రూల్స్, 2021కి అనుగుణంగా డిసెంబర్ 2022లో రిపోర్టును వెల్లడించింది. ఈ యూజర్-సెక్యూరిటీ రిపోర్టులో యూజర్ల ఫిర్యాదులు, WhatsApp ద్వారా తీసుకున్న సంబంధిత చర్యల వివరాలు ఉన్నాయి. లేటెస్ట్ నెలవారీ రిపోర్టులో ఒక్క డిసెంబర్‌లోనే వాట్సాప్ 3.6 మిలియన్ అకౌంట్లను నిషేధించింది.
WhatsApp Accounts Ban _ Over 36 lakh WhatsApp accounts banned in India in December 2022
వాట్సాప్ రిపోర్టు ప్రకారం.. డిసెంబర్ 1, డిసెంబర్ 31 మధ్య మొత్తం 3,677,000 వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. అందులో 36 లక్షల అకౌంట్లలో 1,389,000 అకౌంట్లు యూజర్ల నుంచి కంపెనీకి ఎలాంటి రిపోర్టులు అందకముందే బ్యాన్ అయినట్టు కంపెనీ తెలిపింది.
దేశంలో అత్యధికంగా యూజర్లను కలిగిన వాట్సాప్‌కు 1607 ఫిర్యాదుల రిపోర్టులు అందాయని డేటా వెల్లడించింది. అందులో 1459 బ్యాన్ అప్పీళ్లు వచ్చాయి కానీ, వాట్సాప్ కేవలం 164 మందిపై మాత్రమే చర్యలు తీసుకుంది. వాట్సాప్ కూడా 13 సెక్యూరిటీకి సంబంధించిన రిపోర్టులు అందాయి. రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోలేదు.
భారత్‌లో ఫేక్ వాట్సాప్ అకౌంట్లపై ఎలా రిపోర్టు చేయాలంటే? :
వాట్సాప్ అకౌంట్లపై రిపోర్టు చేయాలంటే.. WhatsApp Settings వెళ్లండి >Help > Contact Us ద్వారా సంప్రదించండి. మీరు భారత్‌లోని ఫిర్యాదు అధికారిని సంప్రదించడానికి మీ ఫిర్యాదు లేదా ఆందోళనతో ఈ-మెయిల్ పంపవచ్చు. ఎలక్ట్రానిక్ సైన్ చేయవచ్చు. మీరు నిర్దిష్ట అకౌంట్ గురించి అధికారిని సంప్రదిస్తే.. దయచేసి కంట్రీ కోడ్ (+91)తో సహా పూర్తి అంతర్జాతీయ ఫార్మాట్‌లో మీ ఫోన్ నంబర్‌ను యాడ్ చేయండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..