Phone Speed Tips : మీ ఫోన్ స్లో అయిందా? ఆండ్రాయిడ్ ఫోన్ వెంటనే స్పీడ్‌ పెరగలాంటే ఇలా తప్పక చేయండి.. ఇదిగో ప్రాసెస్..!

Phone Speed Tips : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయిందా? సాధారణంగా ఏదైనా యాప్ లేదా బ్రౌజర్‌ లేదా సిస్టమ్ ఫైల్‌లు, స్క్రిప్ట్‌లు, ఫొటోల వంటి లోడ్ చేసిన డేటాను కాష్ మెమరీగా సేవ్ చేస్తుంది.

Phone Speed Tips

Phone Speed Tips : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయిందా? సాధారణంగా ఏదైనా యాప్ లేదా బ్రౌజర్‌ లేదా సిస్టమ్ ఫైల్‌లు, స్క్రిప్ట్‌లు, ఫొటోల వంటి లోడ్ చేసిన డేటాను కాష్ మెమరీగా సేవ్ చేస్తుంది. తద్వారా యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు అది వేగంగా లోడ్ అవుతుంది. డేటా ఇప్పటికే మెమరీలో సేవ్ కావడంతో కాష్ డేటా సమయాన్ని డివైజ్ బ్యాటరీని కూడా ఆదా చేస్తుంది.

అయితే, యాప్‌లు, బ్రౌజర్ హిస్టరీ అంతటా మరింత ఎక్కువ కాష్ డేటాను పొందడం వల్ల మీ Android ఫోన్ పర్ఫార్మెన్స్ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, కాష్ డేటా (Cache Data) డివైజ్ ఇంటర్నల్ స్టోరేజీ నిండిపోతుంది. అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ నెమ్మదిగా చేస్తుంది. మీ ఫోన్ పర్ఫార్మెన్స్ పెంచడానికి వెబ్ బ్రౌజర్‌లు, యాప్‌లు రెండింటి నుంచి కాష్ డేటాను క్లియర్ చేయవచ్చు. మీ Android స్మార్ట్‌ఫోన్ నుంచి Cache క్లియర్ చేసేందుకు ఈ కిందివిధంగా ఫాలో అవ్వండి.

ఆండ్రాయిడ్‌లో యాప్ Cache ఎలా క్లియర్ చేయాలంటే? :
– మీ Android ఫోన్‌లోని సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లండి.
– కిందికి స్క్రోల్ చేసి ‘Apps’ లేదా ‘యాప్‌లు & నోటిఫికేషన్‌లు’పై నొక్కండి.
– ఇప్పుడు మీరు Cache క్లియర్ చేసే యాప్ కోసం సెర్చ్ చేయండి ఆపై Tap చేయండి.
– ‘Storage & Cache’పై Tap చేయండి.
– ‘Clear Cache’పై Tap చేయండి.

Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Facebook, Twitter వంటి సోషల్ మీడియా యాప్‌ల నుంచి ఈ యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున మీరు ఎప్పటికప్పుడు Cache క్లియర్ చేయవచ్చు. అయితే, మీరు అన్ని యాప్‌ల Cache కలిపి డిలీట్ చేయాలంటే ఈ యాప్‌లను ఫాలో అవ్వండి.

Androidలోని అన్ని యాప్‌ల కోసం Cache ఎలా క్లియర్ చేయాలంటే?:
– సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.
– ‘Storage’ లేదా ‘Storage & Memory’పై Tap చేయండి.
– ‘Cache Data’పై Tap చేయండి.
– అన్ని యాప్‌ల కోసం Cache క్లియర్ చేసేందుకు ‘OK’ నొక్కండి.

ఆండ్రాయిడ్‌లో బ్రౌజర్ నుంచి Cache ఎలా క్లియర్ చేయాలి :
– మీరు Cache డేటాను డిలీట్ చేయాలంటే Google Chrome యాప్ లేదా ఇతర బ్రౌజర్ యాప్‌ని ఓపెన్ చేయండి.
– Menu ఓపెన్ చేయడానికి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న త్రి డాట్స్ ఐకాన్ నొక్కండి.
– ‘Settings’పై నొక్కండి.
– కిందికి స్క్రోల్ చేసి, ‘Privacy’పై నొక్కండి.
– ‘Clear browsing data’పై నొక్కండి.
– మీరు కాష్‌ను క్లియర్ చేసే టైమ్ పరిధిని ఎంచుకోండి (ఉదా, ‘All Time’).
– ‘Cached images and files’ పక్కన ఉన్న Box ఎంచుకోండి.
– అదనంగా, మీరు Cookies లేదా Browsing History వంటి క్లియర్ చేసే ఇతర డేటా పక్కన ఉన్న Boxలను కూడా చెక్ మార్క్ పెట్టాలి.
– ‘Clear data’పై నొక్కండి.

Cache క్లియర్ చేయడం వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఏదైనా లోపాలు ఉంటే ఫిక్స్ అవుతాయి. దయచేసి మీ బ్రౌజర్ Cache క్లియర్ చేయడం వల్ల స్టోరేజ్ చేసిన ఏవైనా లాగిన్ ఆధారాలు అలాగే Save చేసిన పాస్‌వర్డ్‌లు లేదా ఫారమ్ డేటా డిలీట్ అవుతుందని గమనించండి.

మీరు తరచుగా విజిట్ చేసే సైట్‌ల కోసం మీ లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లను మళ్లీ ఎంటర్ చేయాలి. అదనంగా, Cache క్లియర్ చేసిన తర్వాత యాప్‌లు లేదా బ్రౌజర్ డేటాను రీలోడ్ చేసేందుక మీ డివైజ్ మరింత బ్యాటరీని వినియోగిస్తుంది. కానీ, ఒకసారి లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్ మళ్లీ Cache సేవ్ అవుతుంది. మీరు డివైజ్ ఇంటర్నల్ మెమరీని ఖాళీ చేసేందుకు ఎప్పటికప్పుడు Clear Cache ప్రాసెస్ ఫాలో అవ్వాలి.

Read Also : Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఈ నెల 17నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?