Google Pixel 7 Discount : ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్.. గూగుల్ పిక్సెల్ 7పై భారీ డిస్కౌంట్.. కొంటే ఈ ఫోన్ కొనాల్సిందే భయ్యా..!
Google Pixel 7 Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7)పై భారీ తగ్గింపును అందిస్తుంది. దీపావళి సేల్‌లో మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది.

Pixel 7 to get massive discount, price will effectively drop to Rs 36,499 during Flipkart Big Billion Days sale
Google Pixel 7 Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7)పై భారీ తగ్గింపును అందిస్తుంది. గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్ ఇప్పటికే తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అయితే, ఈ డివైజ్ ఫ్లిప్‌కార్ట్‌లో రాబోయే దీపావళి సేల్ (Diwali Sale) సమయంలో మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 7 కాకుండా, Redmi Note 12 5G, iPhone 12, iPhone 14, Vivo T2 Pro, Nothing Phone (2) వంటి అనేక ఇతర ఫోన్లపై మరెన్నో ఆఫర్లు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7 డీల్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ ప్రకారం.. పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 36,499కి అందుబాటులో ఉంటుంది. అసలు లాంచ్ ధర రూ. 59,999 నుంచి భారీగా తగ్గింది. అయితే, అదే 5G ఫోన్ ప్రస్తుత ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 41,999గా ఉంది. అంటే.. వినియోగదారులు రూ. 5,500 వరకు డిస్కౌంట్ పొందుతారు. అయితే, ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుందా లేదా ఈ డీల్‌లో బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉంటుందా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఈ పిక్సెల్ 7 ధర రూ.40వేల లోపే ఉంటుందని టీజర్ వెల్లడించింది.

Google Pixel 7 Discount
రెడ్‌మి నోట్ 12 5G, నథింగ్ ఫోన్ (2) సేల్ డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకారం.. నథింగ్ ఫోన్ (2) ధర రూ.32,999కి సొంతం చేసుకోవచ్చు. (Redmi Note 12 5G) కూడా తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 14వేల కన్నా తక్కువగా ఉంటుంది. (Oppo Reno 10 Pro), Realme 10 Pro+ ఫోన్ ధర వరుసగా రూ. 35,999 నుంచి రూ. 20,999కి తగ్గుతుంది.
ఐఫోన్ 12 ధర రూ. 32,999 అయితే మోటరోలా G54 ధర రూ. 14,999కి తగ్గుతుంది. Samsung Galaxy Z Fold 5, Moto G84, Motorola Razr Ultra, Samsung Galaxy S23 మరిన్ని ఫోన్లపై కూడా కొన్ని తగ్గింపులు ఉంటాయి. ఈ యూనిట్ల కచ్చితమైన డీల్ ధర ఇంకా వెల్లడి కాలేదు.
ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) విషయానికొస్తే.. కంపెనీ కచ్చితమైన ధర పరిధిని వెల్లడించలేదు. కానీ, సేల్ పేజీలో ధర వరుసగా రూ. 50వేలు, రూ. 60వేల లోపు ఉంటుంది. ఆపిల్ కొత్త (iPhone 15 Launch) లాంచ్ తర్వాత ధర తగ్గింపును అందిస్తుంది. ఐఫోన్ 14 అసలు ధర ఇప్పుడు రూ. 69,900గా ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్‌ల ప్రకారం.. ఐఫోన్ 14 Plus ధర రూ. 79,900గా ఉంటుంది.
Read Also : Google Pixel 7 Pro Discount : గూగుల్ పిక్సెల్ 7ప్రో ఫోన్‌పై రూ. 17వేలు డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?