Book Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ ఐదింటిలో మీకు నచ్చిన మోడల్ సెలక్ట్ చేసుకోండి!

ఓలా మాదిరిగా ఇతర బ్రాండ్లలో కూడా ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లోకి రాబోయే నెలల్లో లాంచ్ కానున్నాయి. ఓలా బైక్ కోసం ప్లాన్ చేసేవారు ఈ బ్రాండ్ బైకుల్లో టాప్ ఐదు ఎలక్ట్రిక్ బైకులపై ఓసారి లుక్కేయండి..

Book Ola Electric scooter : ఆటోమేకింగ్ కంపెనీ ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. లాంచింగ్ ముందుగానే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఇప్పటికే లక్షకు పైగా బుకింగ్స్ చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు ప్లాన్ చేసేవారు.. ఓలా మాదిరిగా ఇతర బ్రాండ్లలో కూడా ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లోకి రాబోయే నెలల్లో లాంచ్ కానున్నాయి. ఓలా బైక్ కోసం ప్లాన్ చేసేవారు ఈ బ్రాండ్ బైకుల్లో టాప్ ఐదు ఎలక్ట్రిక్ బైకులపై ఓసారి లుక్కేయండి..

1. Simple One :
ఓలా ఎలక్ట్రిక్ పోటీదారు బెంగళూరు ఆధారిత స్టార్టప్ కంపెనీ Simple Energy నుంచి సింపుల్ వన్ (Simple One) కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల ఆగస్టు 2021లో ఈ బ్రాండ్ మోడల్ మార్కెట్లోకి రానుంది. Simple Energy కంపెనీ ప్రకారం.. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 70 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే.. 240కిలోమీటర్ల రేంజ్ దూసుకెళ్లగలదు. ఈ స్కూటర్ ధర రూ.1,20వేలుగా ఉండనుంది.

2. Ather 450X :
అథర్ ఎనర్జీ (Ather Energy) కంపెనీ గత ఏడాదిలోనే Ather 450X ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లలో బెస్ట్ మోడల్స్ లో ఇదొకటి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఈ స్కూటర్ ధర రూ.1,32,426 గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 80శాతం ఛార్జింగ్ కావాలంటే 3 గంటల 35 నిమిషాలు పాటు పడుతుంది. అదే ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 116 కిలోమీటర్ల రేంజ్ లో దూసుకెళ్తుంది.

3. TVS iQube :
భారత మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVSD iQube స్కూటర్ కూడా ఒకటి. ఈ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో 40kmph స్పీడ్ లో దూసుకెళ్లగలదు. అదే ఫుల్ చార్జ్ చేస్తే.. సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 75కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లగలదు. అలాగే బైక్ పీక్ టార్క్ కూడా 140Nm వరకు ఉత్పత్తి చేస్తుంది. కెర్బ్ బరువు 118కిలోల వరకు ఉంటుంది.

4. Yamaha’s electric scooter :
యమహా ఇండియా కంపెనీ రాబోయే నెలల్లో భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై భారతీయ పాలసీ విధానాలు ఎలా ఉన్నాయో అనేది గమనిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.

5. Suzuki Burgman electric bike :
సుజుకీ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ వెర్షన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో సుజుకీ బుర్గమ్యాన్ (Suzuki Burgman) ఎలక్ట్రిక్ బైక్. భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాల్లో ఇంధన ఆధారిత మోడల్ బైకుల్లో ఇదొకటి. అయితే ఈ మోడల్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఎప్పుడు మార్కెట్లోకి లాంచ్ చేస్తుందనేది కంపెనీ లాంచ్ డేట్ రివీల్ చేయలేదు.

 

ట్రెండింగ్ వార్తలు