అతి తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అనుకుంటున్నారా? ఇదిగో ఈ ఫోన్ కొనండి..
ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని అందుబాటులో ఉంచుతారు.

అతి తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అనుకుంటున్నారా? భారత్‌లో పోకో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే వారం భారత మార్కెట్లో దీన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
పోకో C61కు కొనసాగింపుగా పోకో C71ను ఆ కంపెనీ తీసుకొస్తోంది. ఇందులో డిస్ప్లే, పనితీరు, కెమెరా వంటి విషయాల్లో అప్‌గ్రేడ్‌లను అందించవచ్చు.
పోకో C71 ఏప్రిల్ 4న భారత్‌లో లాంచ్ అవుతుంది. విశ్లేషకులు ఆ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం.. పోకో C71 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేతో రానుంది. టీయూవీ తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ , సిర్కాడియన్ సర్టిఫికేషన్‌లు, వెట్ డిస్‌ప్లే సపోర్ట్ తో ఇది వస్తుంది.
Also Read: అమెజాన్‌లో తక్కువ ధరకు టాప్ కంపెనీల ఏసీలు.. కొనుక్కుని మీ ఇంటిని కూల్‌గా మార్చేయండి..
కంపెనీ ఇంకా ప్రాసెసర్ గురించి వివరాలు తెలపలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAMతో వస్తుంది. IP52 సర్టిఫికేషన్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 15లో రన్ కావచ్చు. 5,200 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుంది.
పోకో C71లో 32MP ప్రైమరీ షూటర్‌తో పాటు సెకండరీ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉండవచ్చు. స్పిల్ట్-గ్రిడ్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ ఆప్షన్‌తో ఇది వస్తుంది.
పోకో C71 ధర భారత మార్కెట్లో రూ.7,000 లోపు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని అందుబాటులో ఉంచుతారు. పవర్ బ్లాక్, కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్‌తో కలర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది.