Poco C75 5G Series : పోకో సి75 5జీ, పోకో ఎం7 ప్రో వచ్చేస్తున్నాయి.. ఈ నెల 17నే లాంచ్.. ధర, ఫీచర్లు ఏం ఉండొచ్చుంటే?

Poco C75 5G Series : షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి సరికొత్త రెండు 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి. పోకో ఎమ్7 ప్రో 5జీ, పోకో సి75 5జీ అనే రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది.

Poco C75 5G and M7 Pro launching

Poco C75 5G Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి సరికొత్త రెండు 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి. పోకో ఎమ్7 ప్రో 5జీ, పోకో సి75 5జీ అనే రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది.

తద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ రేంజ్ త్వరలో విస్తరించనున్నట్లు ధృవీకరించింది. ఈ రెండూ సరసమైన, స్పెసిఫికేషన్‌లతో 5G-సెంట్రిక్ ఫోన్‌లుగా భావిస్తున్నారు. పోకో M7 ప్రోకి ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. అమోల్డ్ ప్యానెల్, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

పోకో M7 ప్రో స్పెసిఫికేషన్స్ :
రాబోయే ఫోన్ గురించి కంపెనీ ఇప్పటికే అనేక వివరాలను వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ జాబితా ఆధారంగా డివైజ్ సెగ్మెంట్ ప్రకాశవంతమైన అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గరిష్టంగా 2100 నిట్‌లకు చేరుకుంటుంది. డిస్ప్లే సైజు 6.67 అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌‌డీ+ రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, డిస్ప్లేలో బయోమెట్రిక్స్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది.

పోకో సి75 5జీ స్పెసిఫికేషన్‌లు :
పోకో సి75 5జీ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో రానుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షావోమీ హైపర్ఓఎస్‌లో రన్ అవుతుంది. ఈ ఫోన్ 2+4 ఏళ్ల అప్‌డేట్‌లను స్వీకరిస్తుందని బ్రాండ్ పేర్కొంది. అంటే.. రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉన్నాయి. అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే.. పోకో సి75 5జీ కేవలం ఎస్ఏ 5జీకి మాత్రమే సపోర్టు ఇస్తుంది.

పోకో M7 ప్రో, పోకో C75 5జీ లాంచ్ తేదీ, భారత్ అంచనా ధర :
డిసెంబరు 17న డివైజ్‌లు లాంచ్ అవుతాయని బ్రాండ్ ధృవీకరించింది. ధర విషయానికొస్తే.. ఎంట్రీ-లెవల్ ఫోన్ పోకో సి75 రూ. 8వేల నుంచి రూ. 10వేల మధ్య ఉండవచ్చని అంచనా. పోకో M7 ప్రో ధర ఇంకా నిర్ణయించలేదు. అయితే, గత ఎమ్-సిరీస్ మోడల్‌ల ఆధారంగా సుమారు రూ. 10వేలు ఉండవచ్చు.

Read Also : Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ V ఫోల్డబుల్ 5జీ ఫోన్లు వచ్చేశాయి.. ధర, ఫీచర్లు వివరాలివే!