Site icon 10TV Telugu

Raksha Bandhan 2025 Gifts : ఈ రాఖీ పండగ రోజున మీ సోదరికి ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చి సర్‌‌ప్రైజ్ చేయొచ్చు.. ఆన్‌లైన్‌లో ఈజీగా ఆర్డర్ చేయొచ్చు..!

Raksha Bandhan 2025 Gifts

Raksha Bandhan 2025 Gifts

Raksha Bandhan 2025 Gifts : రక్షా బంధన్ 2025 వచ్చేసింది. ఈ పండగ సందర్భంగా మీ సోదరి రాఖి కట్టినందుకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఈ ఏడాదిలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య పవిత్ర బంధాన్ని తెలియజేసేది రక్షాబంధన్. ఈ పండగ ఈ ఏడాదిలో ఆగస్టు 9న జరుపుకుంటారు.

రక్షా బంధన్ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కడతారు. దీనికి ప్రతిగా, సోదరులు వారికి బహుమతిని అందిస్తారు. మీరు ఈ ఏడాది మీ సోదరిని ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఇన్‌స్టంట్ డెలివరీ కోసం మీరు ఆన్‌లైన్‌లో వివిధ ధరల్లో కొన్నింటిని యాప్స్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

ఎయిర్ ఫ్రైయర్స్ :
ఎయిర్ ఫ్రైయర్ అద్భుతమైన బహుమతి కావచ్చు. ముఖ్యంగా మీ సోదరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే ఈ ఆయిల్ ఉపయోగకరంగా ఉంటుంది. మీరు రూ. 2,500 నుంచి రూ. 5వేల మధ్య ధర కలిగిన మంచి ఎయిర్ ఫ్రైయర్‌లను కొనుగోలు చేయొచ్చు.

పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్లు :
పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్ మరొక బెస్ట్ ఆప్షన్. ఈ బ్యాటరీతో పనిచేసే బ్లెండర్లు ఇన్‌స్టంట్ స్మూతీలు, షేక్‌లు, జ్యూస్‌లను తయారు చేసుకోవచ్చు. తరచుగా క్లోజ్ క్యాప్ కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ బ్లెండర్ల ధర రూ. 1,200 నుంచి రూ. 2వేల మధ్య లభిస్తాయి.

Read Also : iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్లు, ధర లీక్.. ఫీచర్లపై భారీ అంచనాలివే!

బ్లూటూత్ స్పీకర్‌లు :
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల బ్లూటూత్ స్పీకర్లు లభ్యమవుతున్నాయి. ఇంటర్నల్ AI అసిస్టెంట్ స్పీకర్లు అద్భుతంగా ఉంటాయి. మీ ఇంట్లో ఇతర స్మార్ట్ గాడ్జెట్లను కంట్రోల్ చేసేందుకు కూడా ఈ బ్లూటూత్ స్పీకర్లను వాడొచ్చు. మీ సోదరికి టెక్ గాడ్జెట్లపై ఆసక్తి ఉంటే మీకు ఇదే సరైన గిఫ్ట్ అని చెప్పొచ్చు. బేసిక్ బ్లూటూత్ స్పీకర్లు దాదాపు రూ. 1,000 నుంచి లభ్యమవుతున్నాయి. అయితే AI అసిస్టెంట్ ఫీచర్లు కలిగిన బ్లూటూత్ స్పీకర్‌లు దాదాపు రూ. 5వేలకు లభిస్తాయి.

ఇయర్‌బడ్స్, హెడ్‌సెట్‌లు :
ఇయర్‌బడ్స్, హెడ్‌సెట్‌లు ముఖ్యమైన గాడ్జెట్లుగా మారాయి. క్వాలిటీ పరంగా పెయిర్ గాడ్జెట్లను బహుమతిగా కావచ్చు. మీరు బ్రాండ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తుంటే రూ. 2వేలు నుంచి రూ. 2,500 మధ్య ధరలో ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయొచ్చు.

హెయిర్ స్ట్రెయిట్నర్స్, డ్రైయర్స్ :
చాలా మందికి అవసరమైన అప్లియన్సెస్. రాఖీ పండగ రోజున మీ సోదరికి ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్స్‌లో ఇదొకటి. మీరు రూ. 1,000 నుంచి రూ. 2,500 మధ్య ధరకు మంచి క్వాలిటీ హెయిర్ స్ట్రెయిట్నర్ లేదా డ్రైయర్‌ను కొనుగోలు చేయొచ్చు.

స్మార్ట్‌వాచ్‌లు :
స్మార్ట్‌వాచ్‌లు అనేవి సాధారణ గాడ్జెట్‌ల నుంచి హెల్త్, ఫిట్‌నెస్ గాడ్జెట్లుగా మారిపోయాయి. ఫోన్‌ అవసరం లేకుండా చిన్న పనులకు స్మార్ట్‌వాచ్ వాడేస్తున్నారు. మీరు కూడా మంచి స్మార్ట్‌వాచ్ మీ సోదరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్‌వాచ్ ధరలు రూ. 3,500 నుంచి రూ. 15వేల వరకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

Exit mobile version