ఒప్పో మొబైల్ తయారీ కంపెనీ అందిస్తోన్న ఫోర్త్ ప్లాగ్ షిప్ హ్యాండ్ సెట్ రియల్ మి 3 సోమవారం (మార్చి 4, 2019) ఇండియన్ మార్కెట్లలోకి విడుదలైంది.
స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ మొదలైంది. స్మార్ట్ ఫోన్ మేకర్స్ పోటీపడి తమ ప్రొడక్ట్ లను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల శాంసంగ్, ఎల్ జీ, జియోమీ, నోకియా హెచ్ఎండీ గ్లోబల్ ఇలా ఎన్నో మొబైల్ తయారీ దారు సంస్థలు తమ కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే ఫీచర్లతో విడుదల చేస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ఫోల్డబుల్ ఫోన్లను సైతం ఎండబ్ల్యూసీ ఈవెంట్ లో ప్రదర్శించాయి. ఇప్పుడు ఒప్పో మొబైల్ తయారీ కంపెనీ అందిస్తోన్న ఫోర్త్ ప్లాగ్ షిప్ హ్యాండ్ సెట్ రియల్ మి 3 సోమవారం (మార్చి 4, 2019) ఇండియన్ మార్కెట్లలో విడుదలైంది.
Also Read : డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు రియల్ మి3 కొత్త స్మార్ట్ ఫోన్ ను ఒప్పో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించి ఫీచర్ వివరాలన్నీ ఆన్ లైన్ షాపింగ్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, రియల్ మి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ 3 లాంచింగ్ లైవ్ స్ట్రీమింగ్ ను కంపెనీ యూట్యూబ్, ఫేస్ బుక్ పేజీల్లో ఒప్పో విడుదల చేసింది. ఇండియా మార్కెట్లలో విడుదలైన జియోమీ రెడ్ మీ నోట్ 7, రెడ్ మి నోట్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్లకు ధీటుగా ఒప్పో రియల్ మి3 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
రియల్ మి3 తో పాటు రియల్ మి3 ప్రొ స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయనుంది. రియల్ మి 3 ప్రొ స్మార్ట్ ఫోన్లో పవర్ ఫుల్ చిప్ సెట్, స్నాప్ డ్రాగన్ 600 సిరీస్ చిప్ ఉండనుంది. అంతేకాదు.. రియల్ మి 3 ప్రోలో ట్రిపుల్ కెమెరాలు, బ్యాక్ సైడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. 3జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 8వేల 999 ఉండగా, 4జీబీ RAM + 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10వేల 999 వరకు ధర నిర్ణయించారు.
Also Read :ఫేస్‌బుక్ మెసేంజర్‌లో మరో కొత్త ఫీచర్
2018లో ఒప్పో రియల్ మి2 ఒరిజనల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా.. ఈ ఏడాది విడుదల ఒప్పో లాంచ్ చేసిన రియల్ మి3 అపగ్రేడెడ్ వర్షన్. Realme 3 కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లకు సంబంధించి వివరాలను ఫ్లిప్ కార్ట్ తమ మైక్రోసైట్ లో అందుబాటులో ఉంచింది. దీంతో పాటు రియల్ మి3 ఐకాన్ ఇన్ కేస్ (రూ599)ను కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8వేల 999 నుంచి మార్కెట్లో లభించనుంది. అయితే రియల్ మి3 ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ, మెమెరీ వేరియంట్లు ఏంటి అనేదానిపై ఒప్పో క్లారిటీ ఇవ్వలేదు. మైక్రోసైట్ లో స్టోరేజీ, వేరియంట్లకు సంబంధించి సమాచారం లేదు. రియల్ మి3 ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
Realme 3 స్పెషిఫికేషన్లు ఇవే..
* మీడియాటెక్ హెలియో పీ70ఎస్ఒసీ, 8 కోర్ ప్రాసిసెర్
*4,230 ఎంఎహెచ్ బ్యాటరీ, రియల్ మి ఇంటర్ ఫేస్
* CPU ఫ్రీక్వెన్సీ 2.1 జీహెచ్ జెడ్
* 3డీ యూనిబాడీ గ్రేడియంట్ డిజైన్
* 6.2 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1520×72 రిజల్యూషన్ మోడ్
* డ్యుయల్ రియర్ కెమెరాలు 13+2ఎంపీ రియర్ కెమెరా
* హెలియో పీ60 కంటే 13% సూపర్ ఫాస్ట్
* స్టోరేజీ, మెమెరీ వేరియంట్లు 3+32 GB, 4+64GB
* డైమండ్ కట్ డిజైన్, డ్రాప్ నాచ్
* గ్లిటరీ బ్యాక్, ట్రెడిషనల్ డైమండ్ కట్ బ్యాక్
* ColorOS 6.0, ఆండ్రాయిడ్ 9 పై
Introducing #realme3!
??3D Unibody Gradient design in 3 colours
??Helio P70 processor
??13+2MP Dual Rear Camera
& more.
Available in:
??3+32 GB, ₹8999
??4+64 GB, ₹10999
Sale begins at 12 pm, 12th Mar on @flipkart & https://t.co/HrgDJTZcxv https://t.co/Y8mVPCZjq3#PowerYourStyle pic.twitter.com/0lyrzjqbM8— Realme (@realmemobiles) March 4, 2019