Realme GT 3 Launch : 240W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి GT 3 ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme GT 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి (Realme GT 3) కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ రెక్టాంగ్యులర్ LED లైట్ ఉంది. వెనుక ప్యానెల్‌లో LED స్ట్రిప్స్ కారణంగా నథింగ్ ఫోన్ (1) మాదిరిగా కనిపిస్తుంది.

Realme GT 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి (Realme GT 3) కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ రెక్టాంగ్యులర్ LED లైట్ ఉంది. వెనుక ప్యానెల్‌లో LED స్ట్రిప్స్ కారణంగా నథింగ్ ఫోన్ (1) మాదిరిగా కనిపిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్‌లో ఒకే ఒక LED స్ట్రిప్ ఉంది. భారీ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ కలిగి ఉంది. మీ స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌లు లేదా వార్నింగ్స్ వచ్చినప్పుడు LED స్ట్రిప్ బ్లింక్ అవుతుంది. నథింగ్ ఫోన్, ఇతర డివైజ్ తేడా ఏంటంటే.. లైట్ కలర్ కస్టమైజ్ చేసేందుకు రియల్‌మి అనుమతిస్తుంది. అయినప్పటికీ, LED స్ట్రిప్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

రియల్‌మి GT 3 240W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తుంది. తక్కువ సమయంలో బ్యాటరీని టాప్ అప్ చేయగలదు. ఈ డివైజ్ 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. 240W ఛార్జర్ 4 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ను అందించగలదు. వేగవంతమైన ఛార్జర్ 65W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌లకు కూడా అనుకూలంగా ఉంటుందని రియల్‌మి పేర్కొంది. వినియోగదారులకు వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందించడానికి Realme ఈ ఫోన్ కోసం ఫ్లాగ్‌షిప్ Qualcomm చిప్‌ని ఉపయోగించింది. ఈ ఫోన్‌పై ఎక్కువ భారం పడినప్పుడు ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. Realme GT 3 స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను అందిస్తుంది.

Read Also : OnePlus 11R Sale in India : వన్‌ప్లస్ 11R ఫోన్ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఇతర ఫీచర్లలో X-యాక్సిస్ లీనియర్ మోటార్‌కు సపోర్టతో పాటు డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. కొత్తగా రిలీజ్ అయిన Realme GT 3 6.74-అంగుళాల స్క్రీన్‌ను 144Hz వద్ద రిఫ్రెష్ చేస్తుంది. ఈ డివైజ్ 40Hz, 45Hz, 60Hz, 72Hz, 90Hz, 120Hz, 144Hzలతో సహా వివిధ రిఫ్రెష్ రేట్‌ల మధ్య ఆటోమాటిక్‌గా మారగలదని కంపెనీ పేర్కొంది.

Realme GT 3 launched with 240W charging, 144Hz display, Snapdragon 8+ Gen 1 SoC

ప్యానెల్ లైటింగ్ 1,400నిట్‌లు, 2772 x 1240 పిక్సెల్‌లు (1.5K) రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో 50-MP సోనీ IMX890 సెన్సార్ ఉంది. లో క్వాలిటీ వీడియోల కోసం OISకి కూడా సపోర్టు ఇస్తుంది. దీనికి 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-MP సెన్సార్ సపోర్టు అందిస్తుంది.

భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే? :
Realme GT 3 భారత మార్కెట్లో లాంచ్‌ తేదీని రివీల్ చేయలేదు. ఈ డివైజ్ MWCలో గ్లోబల్ స్కేల్‌లో కనిపించింది. అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Realme GT 3 లైవ్ లాంచ్ ఈవెంట్ కంపెనీ అధికారిక YouTube ఛానెల్ ద్వారా ప్రసారం కానుంది. భారత స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (8:30 PM IST) లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది.

భారత్‌లో ధర ఎంతంటే? (అంచనా) :
రియల్‌మి GT 3 భారత మార్కెట్లో రెండు మెమరీ వేరియంట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 8GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర సుమారు 370 డాలర్లు (సుమారు రూ. 30,682) ఉంటుందని అంచనా. 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ ధర దాదాపు 470 డాలర్లు (రూ. 38,975) ఉంటుంది. అదనంగా, ఈ డివైజ్ 150W ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్, 240W ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్‌లో లాంచ్ అవుతుంది.

Read Also : Noise Earbuds X Price : కేవలం రూ. 2వేల లోపు ధరకే నాయిస్ బడ్స్ X ఇయర్‌బడ్స్.. 35గంటల బ్యాటరీ లైఫ్‌ కూడా.. ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు